తాజా కథలు @ CCK

తెలుగు సామెతలు

2015-05-20 17:05:02 సామెతలు
*  అందని మ్రానిపండ్లకు అర్రులు చాచుట.

*  ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి .

*  రాత్రివేళ సూర్యునికోసం కన్నీరు పెట్టుకుంటే నక్షత్రాలు కూడా కనిపించవు .

*  కలిగినయ్య కలిగినయ్యకే పెట్టును, లేనయ్య కలిగినయ్యకే పెట్టును.

*  బట్ట అప్పు, పొట్ట అప్పు ఎక్కువ కాలం నిలవదు.

*  దిన దిన గండం వెయ్యేండ్ల ఆయుష్షు.

*  శ్వాస వుండే వరకు ఆశవుంటుంది.

*  దరిద్రుడు మరణం కోరుకుంటాడు... భాగ్యవంతుడు భాగ్యాన్ని కోరుకుంటాడు.

*  ఒక్కొక్కరాయి తీస్తూ వుంటే కొండైనా కరిగిపోతుంది.

*  నిజం చెపితే వున్న ఊరు కూడా మెచ్చదు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం