తాజా కథలు @ CCK

మంచి స్నేహితుడు

2015-04-04 23:05:02 చిన్నారుల కథలు
చాలా కాలం క్రిందట మంచి తెలివితేటలు, వివేకం ఉన్నఒకరాజు ఉండేవాడు. అతడి పేరుప్రతిష్టలు ఇతర రాజ్యాల వరకు పాకిపోయినవి. అనేక కళలలో ఆరి తేరిన కళాకారులు అతని మెప్పును, పారితోషికం పొందేదుకూతడి దర్బారుకు విచ్చేసేవారు. అందులో కొందరు తమ తెలివితేటలను ప్రదర్శించి రాజు వివేకాన్ని పరీక్షించడానికి కూడా దయచేసేవారు. ఒక రోజు ఒక కళాకారుడు రాజుదర్బారుకు వచ్చాడు. తాను తయారు చేసిన మూడు బొమ్మలను కూడా అతను తనతో కూడా తీసుకొచ్చాడు. వ్యత్యాసం లేకుండా ఒకేలా ఉండే ఆమూడు బొమ్మలనూ రాజు ముందు ఉంచుతూ "రాజా ఈ మూడు బొమ్మలనూ, జాగ్రత్తగా పరిశీలించి ఏది అందమైన బొమ్మో ? , ఏది వికారమైన బొమ్మో? ఏది అందంగా కాక, వికారంగాకాక ఉన్నదో పరిశిలించి చెప్పండి" అని ప్రార్ధించాడు. కళాకారుడు మాటలు విన్న రాజు ఆమూడు బొమ్మలనూ చేత్తో పట్టుకొని పరిశీలించాడు. ఆ  మూడు బొమ్మలూ ఒకేలా ఎత్తుగా ఉంటూ బరువులో కూడా సమంగా ఉండటం, అన్నింటి పోలికలూ ఒకేలా ఉండటం రాజు గమనించాడు.

ఆ మూడు బొమ్మల్లో ఎలాంటి వ్యత్యాసాన్ని అతడు. ఆ మూడు బొమ్మలనూ జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఒక బొమ్మ రెండు చెవులలో రంధ్రమున్న సంగతిని గుర్తించాడు. ఒక సూదిని రంధ్రాలున్న బొమ్మ చెవిలొ ఒక వైపు ఉంచి ఆ బొమ్మను కదిలించాడు. సూది మరో చెవిలో సునాయాసంగా బయటకు వచ్చినది. మరొ బొమ్మ చెవిలో మరియూ నోటిలో రంధ్రముండటాన్ని రాజు గమనించాడు. వెంటనే రాజు సూదిని చెవిలో దూర్చాడు . దూర్చిన  సూది నోటి గుండా బయటకు వచ్చినది. మూడవ బొమ్మకు ఒక్క చెవిలో తప్ప మరెక్కడా రంధ్రాన్ని రాజు చేడలేకపోయడు ఆ చెవిలో దూర్చిన సూది బయటకు రాకుండా లోపలే ఉండటాన్ని రాజు గమనించాడు. తానుచేసిన తెలుసుకొనిన చేసిన పనులను గురించి రాజు గంభీరంగా ఆలోచించాడు. కాసేపైన తరువాత ఆ కళాకారుణ్ణి ఉద్దేశించి "మీరు చాలా తెలివి గలిగిన కళాకారులు" అని అభినందించాడు. ఆ తరువాత పరిపూర్ణమైన వివేకాన్ని మీరు ఈ మూడు బొమ్మల ద్వారా జనాలకు బోధించడం నిజంగా నాకు ఆనందాన్ని ఇస్తుంది. మీ ఈ మూడు బొమ్మలు  మూడు రకాల మిత్రులను గురించి చెబుతున్నాను. మన కష్టాలను సహనుభూతితో వింటూ, మన రహస్యాలను కాపాడుతూ, మనకు సహాయం చేయగల నిజమైన స్నేహితులను మనము ఆశించాలి.

ఇందులో మొదటి బొమ్మ మనకున్న చెడ్డ స్నేహితుడిని  గురించి చెబుతుంది. మీరు మీకష్టాలను, బాధలను వినిపిస్తే అతడు అన్నింటిని వింటున్నాట్టూ అభినయిస్తాడు. కానీ అతడు నిజంగా వినడు. అతడు ఏ ఒక్కరికీ ఎలాంటి సహాయం చేయడు. చెవి ద్వారా విన్నది మరో చెవి ద్వారా వదిలి వేస్తాడు. రెండవ రకం స్నేహితుడికి ఈ రెండవ రకం బొమ్మ ప్రతినిధిత్వం వహిస్తుంది. మీ రహస్యాలను అతనితో చెప్పినప్పుడు సానుభూతితో వింటాడు. కాని ఇతడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి  మీ రహస్యాలను ఇతడు బట్టబయలు చేస్తాడు. ఇతడు తనలో మన రహస్యాలను దాచడు. ఈ మూడవ బొమ్మే చాలా ఉత్తమమైనది. ఈ బొమ్మ ఒక ఉత్తమ స్నేహితుడికి ప్రతిరూపం. మీరు చెప్పేమాటలను అతడు చాలా ఓపికతో శ్రధతో వింటాడనీ మీరు నమ్మకంగా నమ్మవచ్చును. మీ రహస్యాలను అతడు తనలో భధ్రంగా తనలో దాచుకుంటాడు. ఎంత కష్టమైనా సరే అతడు ఆ రహస్యాలను బట్టబయలు చేయడు. ఇటువంటి మిత్రుడి సన్నిధిలో మీరు సురక్షితంగా ఉండగలరు. రాజు గారి మాటలు, విశదీకరణ ఆ కళాకారుడికి బాగా నచ్చినాయి. అతడు రాజు వివేకాన్ని, తెలివితేటలను పొగిడాడు.

నీతి :

మీ స్నేహితుల రహస్యాలను బయటపెట్టకండి.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం