తాజా కథలు @ CCK

పండగ అల్లుడు

2015-02-10 21:31:09 చిన్నారుల కథలు
పండక్కి అల్లుడుగారొస్తున్నారని ఉత్తరం రాంగానే గుండెల్లో గుఱ్ఱాలు పరుగెట్టాయి నాకు ! బోలెడంత ఖర్చు ! అష్టకష్టాలుపడి పిండివంటలు చేయటం, అవి తిని హరించుకోలేక నానా అవస్థా పడటం అంతా వేస్టనీ విడప్పుడే రోజుకు ఒక రకం పిండివంట చేసుకుని, తీరిగ్గా తిని, తాపీగా హరించుకోవటమే బెస్టనీ నా అభిప్రాయం. దీనితో మా ఆవిడ ఏకీభవించదు. నూటికి తొంభై పాళ్ళు నాతో వక్రీభవించటమే ఆవిడ సహజలక్షణం! మా ఇద్దరికీ ఘర్షణలు ఘనంగా మొదలయి మొదట నేనే ఓడిపోయి ద్రవీభవించిపోవటం నెగ్గిన సంతోషంకొద్దీ చివరకు ఆవిడా ద్రవించిపోవటంవల్ల సంసారం సామరస్యంగా, సాఫీగా నెట్టుకొస్తున్నాం !

ఇలాంటి వాతావరణంలో, అల్లుడు మొదటిసారిగా పండగకి వస్తానని రాయటం మొదట కొంచెం సంతోషమే కలిగించినా, అతనెలాంటివాడో పండగ అల్లుళ్ళ జాబితాలో ఏ కోవకు చెందుతాడో అలకలూ గిలకలూ తీర్చి, మర్యాదా మన్ననా చేసి, అతన్ని సంతృప్తిగా సాగనంపటం ఎలాగో ఆలోచించిన కొద్దీ గుండెల్లో గుఱ్ఱప్పందాలు ఆగిపోయి, వెయ్యో రెండువేలో గుఱ్ఱపుశక్తి కల రైలింజన్లు రొదపెట్టడం మొదలెట్టాయి !

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం