తాజా కథలు @ CCK

అల్పుడెప్పుడు పల్కునాడంబరముగాను( వేమన శతకం )

2015-06-06 15:05:02 తెలుగు పద్యాలు


పద్యం :- అల్పుడెప్పుడు పల్కునాడంబరముగాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమ !భావం :- అజ్ఞానంతో ఉన్నవాడు అంటే ఏమీ తెలియనివాడు , అన్నీ తనకే తెలిసినట్లుగా ఆడంబరంగా , గర్వంగా మాట్లాడతాడు .జ్ఞానం కలిగినవాడు అంటే ఆన్ని విషయాలు తెలిసినవాడు మృదువుగా , చల్లగా పలుకుతాడు .బంగారం , కంచు చూడటానికి ఒకేలా ఉన్నప్పటికీ కంచును మోగిస్తే పెద్ద శబ్దం వస్తుంది .బంగారం మాత్రం చాలా చిన్న శబ్దం చేస్తుంది .ఈ విషయాన్నే మన పెద్దలు........ ఆన్ని ఉన్నవాళ్లు అణిగిమణిగి ఉంటారని మరొకవిధంగా చెబుతారు .
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం