తాజా కథలు @ CCK

తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు ( వేమన శతకం )

2015-05-26 13:05:01 తెలుగు పద్యాలు


పద్యం :- తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ !భావం :- తల్లిదండ్రుల మీద ప్రేమానురాగాలు లేని కుమారుడు పుట్టినా, మరణించినా ఒక్కటే . మట్టితో తయారైన పుట్టలోనూ చెదలు పుడతాయి , గిడతాయి . తల్లిదండ్రుల మీద దయలేని కొడుకు అటువంటి చెదపురుగులతో సమానం . జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద పిల్లలు దయ కలిగి ఉండాలే కాని నిర్దయగా ఉండకూడదని భావం .
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం