తాజా కథలు @ CCK

పులి - గాజు

2015-05-30 19:05:01 చిన్నారుల కథలు
అనగనగా ఒక అడివిలో ఒక పులుండేది. ఆ పులి ముసలిదైపోయింది. దాని గోళ్ళు, పళ్ళు బలహీనంగా అయిపోయాయి. రోజు వేటాడడం కష్టమయిపోయింది. ఆకలితో బాధ పడుతున్న పులి ఒక రోజు నదీ తీరాన బాగా మెరుస్తున్న ఒక బంగారపు గాజును చూసింది. వెంటనే వెళ్ళి ఆ గాజును తీసుకుంది.

ఇటూ అటూ చూస్తుంటే ఒక చెట్టు కింద కూర్చున్న మనిషి కనిపించాడు. ఆ మనిషిని చూస్తే పులికి నొరూరింది. దెగ్గిరకెళితే ఆ మనిషి పారిపోతాడన్న భయంతో కొంచెం దూరంగా నుంచుని ఆ మనిషిని పిలిచింది. మనిషి పులిని చూసిన వెంటనే పారిపోబోయాడు. కానీ ఆ పులి తన దెగ్గిరున్న గాజును చూపించి నీకిది కావలా అనడిగింది. “నీ దెగ్గిర కొస్తే నువ్వు నన్ను తినేస్తావు. నేను రాను” అన్నాడు మనిషి.

“నిన్ను చూస్తే యువకుడిలా ఉన్నావు. బలంగా కనిపిస్తున్నావు. నీకు నేనంటే భయమెందుకు? నేను చూడు ఎంత ముసలిదాన్నయిపోయాను” అంది పులి. ఈ మాట విని ధైర్యం తెచ్చుకున్న మనిషి గాజును సంపాదించుకుందామన్న దురాశతో పులి దెగ్గిరకు వెళ్ళాడు. వెంటనే పులి మనిషి మీదకు దూకి అతన్ని చంపి తినేసింది.

నీతి :

దురాశ దు:ఖానికి చేటు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం