తాజా కథలు @ CCK

రైతు బద్దకం

2015-05-17 17:05:01 చిన్నారుల కథలు
ఒక ఊరిలో శరభయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా బద్దకం. ఒక రోజు అతను ఎప్పటిలాగే ఎడ్లబండి నడుపుకుంటూ వెళ్తున్నడు. అది వర్షకాలం, ఆ ముందురోజే కుంభవృష్టి కురవడంతో రోడ్డంతా బురదగా, మడ్డిగా ఉంది. ఏదో పరధ్యానం లో ఉండి బండి తోలుతున్న శరభయ్యకు ఎవరో కుదిపేసినట్లు అనిపించడంతో బండి దిగి చూసాడు.

అతని బండి చక్రం ఒకటి బురదలో కూరుకుపోయింది. వెంటనే శరభయ్య దానిని భుజాలతో తీయడానికి ప్రయత్నించకుండా దేవుణ్ణి ప్రార్ధించడం మొదలుపెట్టాడు. దేవుడా నా బండి చక్రం బురదలో కూరుకుపోయింది. ఎలాగైనా నువ్వే కాపాడాలి అంటూ అరవడం ప్రారంభించాడు.

తన భుజాలను ఉపయోగించి బండి చక్రాన్ని సులువుగా పైకి తీయగలడు శరభయ్య. కానీ ! ఏమాత్రం ప్రయత్నించకుండా దేవుడే రావాలి తన బండి చక్రం తీయాలి అని బీష్మించుకు కూర్చున్నాడు శరభయ్య. పది నిమిషాల తర్వాత వర్షం మొదలైంది. అంతే బండి చక్రం మరింతగా బురదలో కూరుకుపోయింది. ఆ రాత్రంతా బద్దకస్తుడైన శరభయ్య అలాగే వానలో తడుస్తూ కూర్చున్నాడు. కానీ ! ఆ చక్రాన్ని పైకి తీయడానికి ఎంతమాత్రం ప్రయత్నించ లేదు. మరుసటి రోజు ఉదయం ఇక మరో దారి లేక ఎలాగోలా చక్రాన్ని పైకి తీసి తన దారిలో తాను వెళ్ళిపోయాడు.

నీతి :

స్వయంకృషి పై ఆధారపడే వారికే  దేవుడి అండ ఉంటుంది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం