తాజా కథలు @ CCK

వడ్లవాడు , సింహము

2014-12-30 09:05:01 చిన్నారుల కథలు
"ఒక గ్రామంలో ఒక వడ్లవాడు ఉండేవాడు. అతడు ప్రతిదినమూ అడవికి పోయి తనకు కావలసిన కట్టెలు తెచ్చుకొనేవాడు. ఇట్లు జరుగుచుండగా ఒకనాడు ఒక సింహము అతనికి ఎదురైనది. దానిని చూచి అతడు గడగడా వణికిపోతూ అక్కడే నిలబడిపోయెను. సింహము అతని చూచి జాలిపడి "నేను నిన్ను ఏమీ చేయను, భయపడకు" అని చెప్పగా, అతడు సంతోషించి తన దగ్గరున్న అన్నమూ, కూరలు దానికి పెట్టెను. ఆ పదార్ధములు తిని సింహము తృప్తి పడెను.

పిమ్మట ఆ వడ్రంగి ప్రతి దినమూ రుచి గల పదార్ధములు తెచ్చి సింహమునకు పెట్టసాగెను, క్రమముగా సింహమునకు వడ్రంగికీ మంచి స్నేహము కలిగెను. అతడు తెచ్చి పెట్టుచున్న పదార్ధములు తిని ఆడుచూ పాడుచూ కాలము గడుపుచుండెను. ఆ సింహమునకు మంత్రులుగా వున్న కాకి, నక్క ఒకనాడు దానిని చూచి "స్వామీ ! మీరు ఈ మధ్య వేటాడుట లేదు. మాతో పూర్వము వలే తిరుగుట లేదు. కారణమేమి అని అడుగగా, సింహము తనకు వడ్రంగితో స్నేహము కలిగినప్పటి నుంచి జరిగిన విషయములన్నింటినీ చెప్పెను. అది విని "ప్రభూ! తమ క్రొత్త స్నేహితుడగు వడ్లవానిని చూడవలెనని కుతూహలముగా ఉన్నది. అని కాకి నక్క పలికినవి. "సరే ! నావెంట రండి" అని సింహము వారిని తీసుకోని బయలుదేరెను.

ఇట్లు వచ్చుచున సింహమును చూచి వడ్రంగి పరుగెత్తిపోయి ఒక చెట్టెక్కి కూర్చుండెను. సింహము ఆ చెట్టు కిందకి పోయి 'చెలికాడా ! నిన్ను చూడవలెనన్న కుతూహలముతో నా స్నేహితులు రాగా నువ్వు చెట్టెక్కి కూర్చుంటి వేమి?" అని అడిగెను. అప్పుడు వడ్లవాడు 'మృగరాజా ! నీవు మంచివాడవే కానీ నీ వెంట వచ్చిన సేవకులు మంచివారు కాదు. నీతో వచ్చిన నక్క యుక్తులు కలది. కాకి  దొంగ బుధ్ధి గలది. కనుక నీతో స్నేహము చేయుట మంచిది కాదని తలచి చెట్టేక్కితిని" అని చెప్పగా, సింహము సిగ్గుపడి వెళ్ళిపోయెను . పిమ్మట చెట్టు దిగి వడ్లవాడు తన యింటికి పోయెను.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం