తాజా కథలు @ CCK

కష్టాల్లో ఉన్నా ప్రశాంతంగా ఆలోచించాలి

2015-06-04 05:05:01 చిన్నారుల కథలు
ఒక నక్క ప్రమాదవశాత్తు ఒక ముళ్ళ పొదలో చిక్కుకుపోయింది. అది ఎంతగా పెనుగులాడినా బయటకు రాలేకపోయింది. దాని తోక చివరి భాగం ముళ్ళ కంచె మధ్యలో ఇరుక్కు పోయింది.

ముళ్ళపొద దట్టంగా ఉండటం దానిలో వివిధ రకాల చీమలు, దోమలు, విషకీటకాలు ఉన్నాయి. నక్క ముళ్ళలో ఇరుక్కు పోవడం గమనించిన దోమల గుంపు దానిపై తమ తడాఖా చూపెట్టాయి. దాంతో నక్క శరీరమంతా విపరీతంగా దద్దులు వచ్చి రక్తం కారడం మొదలయ్యింది. తన రక్తం తాగుతున్న దోమలను నక్క ఏమీ చేయలేక నీరసపడి పోయి, సహాయం కోసం వేచి చూస్తోంది.

అదే సమయంలో అటుగా వస్తున్న ముళ్ళపందిని నక్క తనను దోమల బారి నుండి కాపాడమని బతిమాలింది. ముళ్ళపంది ముళ్ళను తొలగించి,నక్కను కాపాడింది. ముళ్ళపందికి కృతజ్ఞతలు చెప్పిన నక్క దోమల గుంపును మాత్రం కదిలించవద్దని ప్రాధేయపడింది.

దోమల గుంపును ఎందుకు కదిలించవద్దని ముళ్ళపంది అడిగితే, నన్ను కరిచి అవి ఇప్పటి వరకు ఎంతో రక్తాన్ని తాగాయి. వాటిని గనుక వెంటాడితే ఇప్పుడు మరో దోమల గుంపు వచ్చి నా మిగిలిన రక్తాన్ని కూడా తాగుతాయి అని అన్నది నక్క. నక్క సమయస్పూర్తికి, దూరాలోచనకి ముగ్దురాలైన ముళ్ళపంది సరేనని అక్కడి నుండి వెళ్ళిపోయింది.

నీతి :

కష్టాల్లో ఉన్నా ప్రశాంతంగా ఆలోచించాలి.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం