తాజా కథలు @ CCK

నిజమైన స్నేహం

2015-06-10 13:05:02 చిన్నారుల కథలు
ఒక ఊరిలో రాజు అనే అబ్బాయి ఉండేవాడు . ఆ ఊరిలో ఒక చెట్టు కూడా వుండేది. ఆ చెట్టుతో రాజు స్నేహం చేసేవాడు .చెట్టు కూడా అతనితో స్నేహం చేసేది . ఒకరంటే మరొకరికి ప్రాణం . రాజు చిన్నప్పటినుండి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేవాడు . దాని పండ్లు కోసుకొని తినేవాడు . ఆ చెట్టు పూలు జమచేసేవాడు . ఆ పూలతో మాల కట్టేవాడు . దాని పైకి ఎక్కేవాడు . చెట్టు కొమ్మలు పట్టుకొని ఊగేవాడు . ఇద్దరూ దాగుడుమూతలు ఆడేవారు . అలసిపోయాక దాని నీడలో విశ్రమించేవాడు . అలా ఇద్దరూ సంతోషంగా వుండేవారు .

కొంత కాలానికి రాజు పెద్దవాడు అయ్యాడు . ఉద్యోగం కోసం బస్తీకి వెల్లాలనుకున్నాడు . మధ్యలో నది వుంది . నది ఎలా దాటాలి ? అని ఆలోచిస్తున్నాడు . ఆలోచిస్తూనే చెట్టు దగ్గరికి వెళ్ళాడు . దానికి తన సమస్య గురించి వివరించాడు .

వెంటనే , ఆ చెట్టు " తన కొమ్మలు నరికి పడవ తయారుచేసుకోమని " చెప్పింది .

రాజు అలాగే , పడవ తయారుచేసుకొని , దానిపై బస్తీకి వెళ్ళిపోయాడు . బాగా డబ్బు సంపాదించాడు .కొన్నాళ్ళకు ఊరికి తిరిగి వచ్చాడు . వచ్చే కొద్ది రోజుల ముందు ఆ ఊరిలో అతిపెద్ద తుఫాను వచ్చింది . ఇంటికి తిరిగి వచ్చాక చూస్తే ఇల్లు పూర్తిగా కూలిపోయింది .

మళ్ళీ , రాజు చెట్టు దగ్గరికి వెళ్లి జరిగినదంతా వివరించాడు .

అప్పుడు , చెట్టు " నా కాండం నరికి ఇల్లు కట్టుకో " అని చెప్పినది .

రాజు అలాగే ఇల్లు కట్టుకున్నాడు .

చాలా కాలం గడిచింది . రాజు ముసలివాడయ్యాడు . చలికి వణికిపోతూ చెట్టు దగ్గరికి వచ్చాడు .

అది చూసిన చెట్టు రాజుతో ఇలా , " నా ఎండిపోయిన కొమ్మలు , పుల్లలు కాల్చి నీ చలిని పోగొట్టుకో " అంది చెట్టు ఆత్మ .

ఆ విధంగా చెట్టు తన నిజమైన స్నేహాన్ని నిరూపించుకుంది , " తనకు ఉన్నదంతా దానం చేసి " .

తన స్నేహితుడిని కోల్పోయిన రాజు చాలా విచారించాడు .

అప్పుడు , రాజు మరికొన్ని చెట్లు నాటి , వాటిని పెంచాలని నిర్ణయించుకున్నాడు .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం