తాజా కథలు @ CCK

పద్యం : భూషలు గావు మర్త్యులకు భూరి మయాంగద తార హారముల్

2015-04-12 03:05:01 తెలుగు పద్యాలు


పద్యం : భూషలు గావు మర్త్యులకు భూరి మయాంగద తార హారముల్ భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలు గావు పూరుషుని భూషితు చేయు పవిత్రవాని వా గ్భూషణమే సుభూషణము భూషణముల్ నశియించునన్నియున్భావం : బంగారపు కిరీటాలు , ముత్యాల హారాలు , చక్కగా అలంకరింపబడిన కొప్పు , మృదువైన పుష్పాలు , సుగంధపు నీటితో స్నానం ....వీటిలో ఏ ఒక్కటీ మానవునికి నిజమైన అలంకారాలు కావు . పవిత్రమైన వాక్కు మాత్రమే మానవుని అలంకారం . ఇతర అలంకారాలన్నీ తాత్కాలికాలే .
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం