తాజా కథలు @ CCK

మూర్ఖంగా ప్రవర్తించరాదు

2015-05-14 05:05:01 చిన్నారుల కథలు
అనగనగా రంగాపురం అనే ఊరిలో నలుగురు స్నేహితులు వున్నారు . ఆ నలుగురు స్నేహితులలో ముగ్గురు సర్వశాస్త్రాలలో ఆరితేరిన వారు . కానీ ! వారి ముగ్గురికీ లౌక్యం మరియు తెలివితేటలు శూన్యం . అయితే ! నాల్గవవాడు రంగడికి చదువుసంధ్యలు లేకపోయినా తెలివిగల వాడు .

ఒకరోజు ఈ స్నేహితులందరూ బాగా డబ్బులు సంపాదించాలని తలచి అరణ్య మార్గాన పొరుగు రాజ్యానికి పయనమయ్యారు . రంగడిని మిగిలిన ముగ్గురూ ఇలా అడిగారు ...మాకయితే సరే చదువు వుంది కాబట్టి పని దొరుకుతుంది , మరి నీకు చదువు రాదు కదా ! మరి నీకు పని ఎలా దొరుకుతుంది ? అప్పుడు , రంగడు ఏదో ఒక పని దొరుకుతుందిలే అని , శాంతంగా బదులిచ్చాడు .

వారికి అడవిలో మార్గమధ్యంలో ఒక కళేబరం కన్పిస్తుంది . అది సింహం కళేబరం .

మొదటివాడు దానిని చూసి చెల్లాచెదురుగా వున్న ఎముకలన్నిటినీ సింహం ఆకారంలో సరిగ్గా అమర్చుతాడు .

ఆ ఎముకలకు రెండవవాడు చర్మం మరియు మాంసం వచ్చేలా చేస్తాడు . తర్వాత , మూడవ వాడు దానికి ప్రాణం వచ్చేలా చేస్తాను అంటాడు .

అక్కడే వున్న రంగడు వారి చర్యలను గమనించాడు . వెంటనే , రంగడు మిగిలిన ముగ్గురితో ఇలా అన్నాడు . స్నేహితులారా ! మీరందరూ గొప్ప పండితులని నాకు తెలుసు . ఇంతవరకూ మీరు చేసినది సరియైనదే . కానీ ! దానికి ప్రాణం వచ్చేలా చేస్తే అది మన ప్రాణాలు తీస్తుంది . ఎందుకంటే అది క్రూరజంతువు అని హెచ్చరించాడు . కానీ , వారు వినిపించుకోలేదు .

వెంటనే , రంగడు ఒక పెద్ద బూరుగు చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు .

మూర్ఖత్వంతో మూడవ వాడు తన విద్యతో సింహానికి ప్రాణం వచ్చేలా చేస్తాడు . సింహం వెంటనే లేచి నిలబడింది . వారి పైకి దాడికి దిగింది . ఆ ముగ్గురూ ప్రాణభయంతో పరుగులుతీశారు .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం