తాజా కథలు @ CCK

దురాశ దు:ఖానికి చేటు

2015-02-06 14:08:46 చిన్నారుల కథలు
గణపతిది చాలా చెడు స్వభావం . అతడు ఇతరులను మోసం చేస్తూ డబ్బులు సంపాదించేవాడు .

ఒకరోజు గణపతి ప్రక్క గ్రామానికి వెళ్ళవలసివచ్చింది . మరి డబ్బులు ఎలా ? వెంటనే గణపతి బుర్రలో ఒక చెడు ఆలోచన వచ్చింది . నడక మొదలుపెట్టాడు . కొంత దూరం వెళ్ళాక దారిలో పడిపోయినట్టు నటించాడు . కొద్ది సమయం తర్వాత అటు వైపుగా వస్తున్న బాటసారి గణపతిని గమనించాడు . అప్పుడు , అతడు " పాపం ఎవరో స్పృహ తప్పి పడిపోయారు " , అంటూ గణపతి మొహం పైన నీళ్ళు చల్లాడు . అప్పుడు గణపతి స్పృహలోకి వచ్చినట్టు నటిస్తూ లేచి కూర్చున్నాడు . గణపతి , బాటసారికి కృతజ్ఞతలు చెబుతూనే " అయ్యో ! నా డబ్బు మూట ఏమయింది ? " అంటూ , విచారంగా ఆ బాటసారిని అడిగాడు . " డబ్బు మూటనా ? నాకు తెలియదు . అంటూ బాటసారి అయోమయంలో పడ్డాడు .

" నేను స్పృహలో లేనని నా డబ్బు మూట కాజేస్తావా ? పద వెళ్దాం మనం ముందు గ్రామ పెద్దల దగ్గరికి " , అని అంటూ బాటసారిని గణపతి గ్రామ పెద్దల దగ్గరికి తీసుకువెళ్ళాడు .

వారితో గణపతి ఇలా అన్నాడు , అయ్యా ! నేను దారిలో నీరసంతో స్పృహ తప్పి పడిపోయివుంటే ఇతను నా మొహం మీద నీళ్ళు చల్లిన విషయం వాస్తవమే . కానీ ! వెయ్యి రూపాయలు రూపాయలు మరియు కొన్ని బంగారు నగలు వున్న నా డబ్బు మూటని ఈ బాటసారి దొంగిలించాడు " , అని ఫిర్యాదు చేశాడు .

అప్పుడు బాటసారి గ్రామ పెద్దలతో ఇలా అన్నాడు , " అయ్యా ! ఇతను శారిలో స్పృహ తప్పి పడిపోయివుంటే నేను మానవత్వంతో ఇతనికి సహాయం చేశాను . అంతే కానీ ! ఆ డబ్బు మూట గురించి నాకు తెలియదు " ,అని వినయంగా విన్నవించుకున్నాడు .

గ్రామ పెద్దకు గణపతి కపటబుద్ది అర్థమయింది . అతడు కొంచెంసేపు ఆలోచించాడు , నిజానికి బాటసారి డబ్బు మూట దొంగిలించి వుంటే సహాయం చేయకుండా వెళ్ళిపోయేవాడు . ఇదంతా , గణపతి నాటకమే అని అనుకున్నాడు .

ఇక గ్రామ పెద్ద వారితో ఇలా అన్నాడు , సరే ! మీరు ఇద్దరూ రేపు ఉదయం నా దగ్గరికి రండి తీర్పు చెప్తాను , అని వారి చిరునామాలు తీసుకొని పంపివేశాడు .

మరునాడు ఉదయం వాళ్ళిద్దరూ గ్రామ పెద్ద దగ్గరకు వచ్చారు .

గణపతీ ! నీ మూటను ఈ బాటసారే దొంగిలించాడు . అందులో వెయ్యి రూపాయలు మరియు కొన్ని బంగారు నగలు వున్నాయి . కానీ ! మొన్న కొత్వాలు గారింట్లో దొంగతనం జరిగింది . పరిశీలిస్తే అవి ఈ నగలేనని తేలింది . మరి అవి నీ దగ్గరకు ఎలా వచ్చాయి ? , అని అడిగాడు గ్రామ పెద్ద .
గణపతి సమాధానం చెప్పలేకపోయాడు . పైగా తను చసిన మోసం గ్రామ పెద్ద గ్రహించాడని అర్థమైంది . గణపతి వెంటనే గ్రామ పెద్ద కాళ్ళ మీద పడి , తప్పయిపోయింది , నన్ను క్షమించండి , మోసంతో డబ్బులు సంపాదిన్చాలనుకున్నాను అని అంటూ తన తప్పును ఒప్పుకున్నాడు .

గతంలో నువ్వు చేసిన మోసాలూ ఎవరూ నిరూపించలేకపోయారు . కానీ ! ఈ సారి నువ్వు దొరికిపోయావు , అని అంటూ గణపతికి తగిన శిక్ష విధించి , వెయ్యి రూపాయల జరిమానా కుడా విధించాడు .

నీతి :

దురాశ దు:ఖానికి చేటు .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం