తాజా కథలు @ CCK

అమ్మ చదువుకుంటే పిల్లలకు జ్ఞానబోధ చేస్తుంది

2015-05-31 15:05:02 చిన్నారుల కథలు
అమ్మ చదువుకుంటే పిల్లలకు జ్ఞానబోధ చేస్తుంది .వారిని మంచి దారిలో నడిపేందుకు ప్రయత్నిస్తుంది . ఇందుకు మదాలస జీవితమే నిదర్శనం . బతుకంతా ఎగుడు దిగుళ్లకు లోనయినా చదువు ఆవశ్యకతను గుర్తెరిగి నడుచుకుంది . నలుగురు కొడుకులకూ అక్షరభిక్ష పెట్టి ముందు యుగాలకు వెలుగుదీపమై నిలుస్తుంది .
విశ్వావసుడనే గంధర్వరాజు కుమార్తె మదాలస . శాస్త్రాభ్యాసం చేస్తుంది . ప్రతిఒక్కరూ జ్ఞానవంతులవ్వాలనే ఆలోచనతో చెలికత్తెలకూ అక్షరాలూ నేర్పిస్తుంది . ప్రజలలో సదవగాహన , చైతన్యం పెరిగితేనే రాజ్యం బాగుపడుతుందని తలపోస్తుంది . ఇంతటి ప్రతిభాశాలిని , అందెగత్తని స్వంతం చేసుకోవాలని పాతలకేతుడు పథకం వేస్తాడు . ఆమె ధర్మమార్గంలో తనకు దక్కదని దుర్మార్గానికి ఒడిగడతాడు . ఉద్యానవనంలో తిరుగాడుతున్నపుడు మత్తు మందు చల్లి అపహరించి కొండగుహలో బంధిస్తాడు .

తెలివి వచ్చాక మదాలస ....... తన అందమే తనకు శత్రువైందా అని ఏడుస్తుంది . అసురునికి భార్య కావటం కంటే చనిపోవడమే మేలని ప్రాణ త్యాగానికి దిగుతుంది . ఇంతలో ఆకాశవాణి " పాతాలకేతుడు ఎట్టిపరిస్తితుల్లోనూ భర్తకాజాలడు , అతడిని వధించెన్ధుకు వచ్చిన వీరునితో నీ వివాహం జరుగుతుంది " అని , చెబుతుంది .

ఇలా .... కొన్ని రోజులు గడిచాక కువలయాశ్వుడు అనే మహా వీరునితో పాతాలకేతుడు కోరి యుద్ధం తెచ్చుకుంటాడు . పాతాలకేతుడిని తరుముకుంటూ కువలయాశ్వుడు కొండగుహలోకి వస్తాడు . అతన్ని సంహరిస్తాడు . అక్కడే వున్న మధాలసను చూస్తాడు . ఆమె పడిన బాధలు తెలుసుకొని విచారిస్తాడు . అందం , అక్షరజ్ఞానం , మానవత కలగలసిన ఒక పూర్నకాంతను ఆమెలో చూస్తాడు . కువలయాశ్వుని వీరత్వానికి మదాలస కుడా ముగ్దురాలవుతుంది .

కువలయాశ్వుని భార్యగా ఆయన రాజ్యానికి చేరుతుంది మదాలస . తను నేర్చుకున్న చదువును అందరికీ పంచడానికి పాటుపడుతుంది . కొన్నాలపాటు అంతా సవ్యంగానే సాగుతుంది . కానీ , మరొకసారి మదాలసకు పరీక్షలు మొదలవుతాయి .
కువలయాశ్వుడు ప్రజల పరిస్తితులు తెలుసుకోవడానికి రాజ్య పర్యటనకు వెళతాడు . ఆ సమయంకోసమే ఎదురుచూస్తున్న తాలకేతుడనే అసురుడు యతిరూపంలో రాచమందిరానికి చేరుకుంటాడు . తన మాయతో కువలయాశ్వుడు ధరించిన ఆభరణాలను సృష్టించి ...... అరణ్యంలో క్రూరమృగాల బారిన పడి కువలయాశ్వుడు చనిపోయాడని చెబుతాడు . ఆ మాటలు నిజమనుకుంటుంది మదాలస . భర్త లేని లోకంలో ఉండలేనని ఊపిరి వదులుతుంది .

కువలయాశ్వుడు తిరిగి వచ్చాక విషయం తెలిసి ఏడుస్తాడు . ఆమె లేని లోకం శూన్యమనిపిస్తుంది . సామ్రాజ్య పాలనను వదిలిపెడతాడు . రాజ్యమంతా అల్లకల్లోలమవుతుంది .

ఈ పరిస్థితిని సరిచేసేందుకు ఆశ్వతరుడనే జ్ఞాని తలుస్తాడు . శివుడి కోసం తపస్సు చేసి కువలయాశ్వుని బాధలు తొలగించేలా మదాలసను భూమి పైకి పంపించమని ప్రార్తిస్తాడు . ఆమెను కూతురిగా ప్రసాదించమని వేడుకుంటాడు . శివుడు సరేననడంతో మదాలస పూర్వపు రూపురేఖలతో , బ్రహ్మజ్ఞానిగా ఆశ్వతరుని కూతురిగా జన్మిస్తుంది .

ఆ యువతికి యుక్తవయసు రాగానే కువలయాశ్వుని వద్దకు తీసుకువెళతారు దైవజ్ఞులు . మదాలస ఇన్నాళ్ళకు కనిపించిందంటూ ఆయన చాలా సంతోషిస్తాడు . మళ్ళీ రాజుగా బాధ్యతలు చేపడతాడు .

వారికి విక్రాంతుడు , సుభాహుడు , శత్రుమర్దనుడు , అలర్కుడు అని నలుగురు పుత్రులు జన్మిస్తారు . వారికి తానే గురువవుతుంది మదాలస . ఆమె ఎన్నడూ చదువును అలక్ష్యం చేయదు .

జ్ఞాన ప్రపంచాన్ని కాంక్షించే పురాణ స్త్రీ మదాలస . బిడ్డలకు తనే గురువై పాటాలు చెబుతుంది . ధర్మాధర్మాలను విడమరిచి చెప్పి వారికి బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తుంది .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం