తాజా కథలు @ CCK

మార్పు మంచిది

2015-03-28 23:05:01 చిన్నారుల కథలు
సీతాపురంలో సిద్దిశెట్టి అనబడే వ్యాపారి ఉండేవాడు .ఆ గ్రామములో అంతకు ముందు చాలా మంది వ్యాపారులు వుండేవారు .

కానీ ! సిద్ధిశెట్టితో పోటీ తట్టుకోలేక వాళ్ళందరూ ఆ గ్రామము నుండి ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు . ఆ గ్రామములో రైతులు ఏ వస్తువునైనా కొనాలన్నా మరియు అమ్మాలన్నా సిద్ధిశెట్టి వద్దకు వెళ్ళాల్సిందే . ఈ విషయాన్ని అదునుగా తీసుకొని సిద్ధిశెట్టి రైతులు పండించిన ధాన్యాన్ని తక్కువ ధర చెల్లించి కొనేవాడు . అలాగే , గ్రామస్తులకు అధిక ధరకు వస్తువులను అమ్మేవాడు . రైతులకు అప్పులు ఇచ్చి అధిక వడ్డీలు వసూలు చేసేవాడు .

ఇలా , చాలా సంవత్సరాలు గడిచాయి . సీతాపురంలో సిద్ధిశెట్టి తప్ప మిగిలిన అందరి పరిస్థితీ దారుణంగా ఉండేది . ప్రజలదరూ పేదవారు కావటంతో ఆ గ్రామానికి వారానికి ఒకసారి వచ్చే వైద్యులు కూడా రావటం మానేశారు . చదువుకునేవారు తగ్గిపోవటంతో ఆ గ్రామంలోని పాటశాల కుడా ముతపడినది .

సిద్ధిశెట్టి కుమారుడు పోశెట్టి పెళ్లి వయసుకు వచ్చాడు . అతనికి సరియైన అమ్మాయిని వెతికి పెళ్లి చేయాలని సిద్ధిశెట్టి చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్ళినాడు . తన ఆస్తుల వివరాలు మరియు తన కుమారుడి గురించి ఎంతో గొప్పగా ఎదుటి వారికి చెప్పాడు .

కానీ ! వారు మాత్రం సీతాపురం సంబంధమైతే తమకు వద్దని , " ఆ గ్రామంలో చదువుకోవడానికి పాటశాల లేదని , అవసరానికి వైద్యులు కుడా అందుబాటులో ఉండరని , గ్రామమంతా పేదరికం " అని , బదులిచ్చేవారు .

అయితే ! సిద్ధిశెట్టి ఆ చుట్టుప్రక్కల వెళ్ళని ఊరు అంటూ లేదు . కానీ ! పోషేత్తికి సంబంధం కుదిరేది కాదు .

చివరికి సిద్దిశెట్టి తన అత్యాశ వల్లే గ్రామములో ఈ పరిస్థితి వచ్చిందని తెలుసుకున్నాడు . కన్నతల్లి లాంటి గ్రామం సుభిక్షంగా ఉంటేనే గ్రామంతోపాటు తనకూ ఒక విలువ ఉంటుందని అర్థం చేసుకున్నాడు .

వెంటనే , సిద్ధిశెట్టి తన స్వంత డబ్బుతో ఆ గ్రామంలో పాటశాల మరియు వైద్యశాల నిర్మించాడు . ప్రజలకు సరియైన ధరలకు సరుకులు అమ్మటం మరియు కొనటం చేసాడు .

దాంతో , గ్రామంలోని వారి పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడినది .

ఈ మార్పు గురించి చుట్టుప్రక్కల గ్రామాలకూ నెమ్మది నెమ్మదిగా తెలిసింది.

అప్పుడు , పోశెట్టికి తమ కూతురిని ఇచ్చి పెళ్లి చేసేందుకు చాలామంది చుట్టుప్రక్కల గ్రామాల నుండి ఇష్టంగా ముందుకు వచ్చారు .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం