తాజా కథలు @ CCK

మేలు చేసిన వారిని ఎన్నడూ మర్చిపోకూడదు

2015-05-02 03:05:01 చిన్నారుల కథలు
ఒక పెద్ద ఏనుగు ఓ అడవిలో నివసిస్తూ వుండేది . అది ప్రతి రోజూ మధ్యాహ్నం ఆహారం ముగించిన తర్వాత చెరువు దగ్గరికి వెళ్లి కడుపునిండా నీళ్ళు తాగుతుంది . ఓ రోజు అలాగే నీరు తాగి గడ్డి మీద నడుస్తూ తిరిగి వెళ్ళసాగింది . అప్పుడు దారిలో ఆ ఏనుగుకు పెద్ద ముళ్ళు ఒకటి కాలిలో గుచ్చుకున్నది .
తర్వాత ఏనుగు కాలి నుండి ముల్లును తొలగించడానికి ఎంతగానో ప్రయత్నించింది . కానీ , దాని ప్రయత్నాలేవీ ఫలించలేదు .
అది ఎండా కాలం . అందునా మధ్యాహ్న సమయం కావడంతో ఎండా వేడిమికి తట్టుకోలేక , ఏనుగు కళ్ళు తిరిగి నేల మీద పడిపోయింది . ఏనుగుకి అడుగు తీసి అడుగు వెయ్యలేని పరిస్థితి . ఏనుగు భాధతో మూలుగుతూ వుంది .
ఆ సమయానికి అటువైపుగా ఒక కుందేలు వచ్చింది . అది చాలా అందమైన కుందేలు . ఆ కుందేలు విషయం తెల్సుకొని తెలివిగా ఏనుగు కాలిలో గుచ్చుకొన్న ముల్లును తొలగించింది . అప్పుడు ఏనుగుకి ముళ్ళు భాద నుండి కొంచెం ఉపశమనం కలిగింది . ఏనుగు కుందేలు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది .
కొన్ని రోజుల తర్వాత కుందేలు తన బొరియను బాగుచేసుకుంటుండగా తోడేలు ఒకటి దాని మీద దాడికి దిగింది .
ఆ సమయంలో అటువైపుగా వస్తున్న ఏనుగు చూసింది . అది తనను కాపాడిన కుందేలుకు ప్రమాదం వుందని గమనించి అక్కడికి వచ్చింది . ఏనుగు కుందేలును తన మీద కూర్చోమని చెప్పింది .వెంటనే , కుందేలు ఏనుగు పైకి ఎక్కి కూర్చుంది . ఏనుగు బిగ్గరగా అరిచింది . ఏనుగు అరుపుకి భయపడిన తోడేలు భయంతో అక్కడినుండి పారిపోయింది .
అంతే ఇక ఆనాటి నుండి కుందేలు మరియు ఏనుగు ప్రాణస్నేహితులుగా ఉండసాగారు .

నీతి :
మేలు చేసిన వారిని ఎన్నడూ మర్చిపోకూడదు .
మనం ఒకరికి మేలు చేస్తే మనకు ఇంకొకరు మేలు చేస్తారు .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం