తాజా కథలు @ CCK

తగిన శాస్తి

2015-05-22 05:05:01 చిన్నారుల కథలు
అవంతీపుర రాజ్యాన్ని పరిపాలించే రాజు అసమర్ధుడు కావడం వలన , రాజ్య వ్యవహారాలన్నీ రాజు చిన్న రాణి కుముoదినీ దేవి నిర్వహించేది . పట్టపురాణికి తెలియని వింత వ్యాధి వచ్చి , అకాల మరణం చెందినది. దాoతో , ఆమె ఒక్కగానొక్క కూతురు సునంద తల్లి లేని పిల్ల అయింది.రాజు చిన్న రాణి కుముoదినీ దేవి సునందను చాలా బాధలు పెట్టేది. కుముoదినీ దేవి పెట్టే బాధలు భరించలేక సునంద రోజూ ఏడుస్తూ ఉండేది .

రాజు చిన్న రాణి కుముoదినీ దేవిని వారించలేక సతమతo అయ్యేవాడు. చిన్న రాణి కుముoదినీ దేవి పెట్టే బాధలు భరించలేక సునంద ఓ రోజు అడవిలోకి పారిపోయింది. చాలా సేపు అడవిలో ఎక్కడెక్కడో తిరిగి, నీరసంతో చీకటి పడే వేళకి అక్కడ ఓ పాడు పడిన పెద్ద భవనం కనిపిస్తే అందులోకి వెళ్ళింది. అక్కడ ఓ పెద్ద పాత కాలపు పందిరి మంచం కనిపిస్తే, దాని మీద నిద్రపోయింది.

ఆ భవనంలో చాలా సంవత్సరాలుగా ఒక బ్రహ్మరాక్షసి ఉంటోంది. అది ఆ రాత్రి భవనంకి వస్తూనే తన మంచం మీద ఎవరో పడుకుని ఉండడం చూసింది. కోపంతో , ఆ అమ్మాయిని చంపి తినెయ్యాలనుకుంది. కానీ ! దానికి అప్పుడు ఆకలి లేదు. అదీకాక, అమాయకంగా కనిపిస్తున్న ఆ అమ్మాయిని చంపడం దానికి ఇష్టం లేదు. నిద్ర లేపి , ఆ అమ్మాయి వివరాలు తెలుసుకోవానుకుంది.

సునంద నిద్రలేస్తూనే బ్రహ్మరాక్షసిని చూసింది . తనని ,చూసి కూడా ఆ అమ్మాయి భయపడకపోవడం బ్రహ్మరాక్షసికి ఆశ్చర్యం కలిగింది. ‘‘ అమ్మాయీ ! నన్ను చూస్తే మీ మానవులందరూ వణికిపోతారు. కానీ ! నువ్వు కొంచెం కూడా భయపడడంలేదు. కారణం ఏమిటి ? ’’ అని , అడిగింది.

దానికి , సునంద బ్రహ్మరాక్షసితో ఇలా అంది - ‘‘ నాకు సవతి తల్లి ఉంది. ఆమె పేరు కౌముందినీ దేవి . ఆమె చాలా భాద పెడ్తుంది . ఆమె కనిపిస్తే చాలు నా ప్రాణం పోయినట్టు అవుతుంది ’’ అని , తన సవతి తల్లి పెట్టే భాదల గురించి చెప్పింది . దాoతో , బ్రహ్మరాక్షసి మనసు కరిగిoది. వెంటనే , సునందకి తినడానికి ఆహారం ఇచ్చింది , సునందకు ఓ " మాయా దర్పణం ", ఓ " మాయా జలతారు చీర ", ఒక జత " మాయా పాదరక్షలు " ఇచ్చి , ధైర్యంగా కోటకు వెళ్ళమని చెప్పింది .

సునంద , కోటకు వెళ్ళడానికి భయపడినా, ధైర్యంగా రాచనగరుకి చేరుకుంది. తిరిగి వచ్చిన సునందని చూస్తూనే చిన్న రాణి , కౌముందినీ దేవి కోపంతో ఊగిపోయింది. దుర్భాషలూ ఆడింది. కానీ , సునంద తెచ్చిన వస్తువులను సునంద నుండి లాక్కుంది.

ముందుగా , అందంగా మెరిసిపోతున్న మాయ జలతారు చీరని కట్టుకుంది. అంతే ! ఆమె శరీరo అంతా.... పొడలు పొడలుగా మారిపోయింది. అది , గమనించని రాణి, ఆ చీరలో తను ఎలా వున్నానో మాయా దర్పణంలో చూసుకోవాలనుకుంది . అంతే ! అద్దంలో తన వికృతాకారం చూసి భయపడి అరిచింది .

ఇంతలో , రాజు గారు అక్కడికి వచ్చాడు . వికృతాకారంలో ఉన్న రాణిని పోల్చుకోలేకపోయాడు . వెంటనే కోటని వదలి వెళ్ళమని ఆదేశించేడు . చిన్న రాణి , రాజుతో తన గురించి చెప్పాలనుకున్నా , ఆమె గొంతు పెగల్లేదు . ఆమె ఏడుస్తూ మాయా పాదరక్షలను ధరించింది.

అంతే ! ఒక వింత శక్తి ఏదో చిన్న రాణిని లాక్కునిపోయి సుదూర తీరంలో వున్నఒక దట్టమైన అడవిలో పడేసింది . ఇక అప్పటి నుండి రాకుమారి సునందకి సవతి తల్లి బాధలు తప్పినాయి . రాజు కూడా సునందను ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు.

కొద్ది రోజులకే ఉజ్జయినీ రాజకుమారునితో సునంద వివాహం జరిపించాడు.

సునంద పెళ్ళికి ఆకాశమంత పందిరి , భూదేవంత ముగ్గు వేసారు . దీపాల కాంతులు రాత్రీ , పగలు తేడా లేకుండా చేసినాయి . మంగళ వాయిద్యాలూ, వేదమంత్రాలూ మారు మ్రోగినాయి . రాచ కుటుంబాల వారూ, పుర జనులూ , వారూ వీరూ అని కాదు ! ఇసక వేస్తే రాలనంత మంది జనాలతో , అతిథులతో కళకళలాడిపోయింది వివాహ వేడుక .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం