తాజా కథలు @ CCK

గణతంత్ర దినోత్సవం

2015-06-16 11:05:01 దేశభక్తి గీతాలు
ఒక దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజుని ఆదేశము గణతంత్ర దేశం గా ప్రకటించుకుని జరుపుకునే "జాతీయ పండుగ" దినం. భారతదేశం లో గణతంత్ర దినోత్సవము మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన 26 జనవరి 1950 దినానికి గౌరవంగా జరుపు కుంటారు.ఈ రోజున బ్రిటీషు కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయి, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పాటయింది.

భారతదేశానికి 1947 ఆగస్టు 15 న స్వాతంత్రము వచ్చినది. దేశానికి రాజ్యాంగము తయారు చేయటానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. దీనికి అధ్యక్షుడుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29 న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఛైర్మన్ గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. రాజ్యాంగము తయారు చేయడానికి ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ప్రజాస్వామ్య విధానంగా రూపుదిద్దారు. అనేక సవరణల అనంతరము 1949 నవంబరు 26 న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగానికి 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలము పట్టింది. ప్రపంచములోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగము గా గుర్తించబడింది. అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమలుపరిచడంతో భారతదేశము సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా రూపొందడంతో పరిణామ దశ పూర్తయింది.

1930 జనవరి 26 న పూర్ణ స్వరాజ్ కు భారత జాతీయ కాంగ్రెస్ పిలుపునిచ్చిన రోజు కావటంతో 26 జనవరి ని ఎంపిక చేశారు.

భారతదేశానికి మూడు జాతీయ సెలవు దినాలలో ఇది ఒకటి. మిగతావి స్వాతంత్ర్య దినోత్సవం మరియు గాంధీ జయంతి.

 

 

మూలం : వికీపీడియా

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం