తాజా కథలు @ CCK

పద్యం : మకర ముఖాంతరస్థమగు మానికమున్ బెకిలింపవచ్చు బా

2015-06-18 09:05:01 తెలుగు పద్యాలు


పద్యం : మకర ముఖాంతరస్థమగు మానికమున్ బెకిలింపవచ్చు బా యక చలదూర్మికా నికరమైన మహోదధి దాటవచ్చు మ స్తకమున బూవు దండవలె సర్పమునైన భరించవచ్చు మ చ్చిక ఘటియించి మూర్ఖజన చిత్తము దేల్ప నసాధ్యమేరికిన్ .భావం : మొసలి నోటిలో వున్న రత్నాన్నయినా ప్రయత్నించి బయటికి తీయవచ్చు . నిరంతరమూ పైకెగసే పెద్ద అలలు గల సముద్రాన్నయినా దాటవచ్చు . పామునైనా పూల దండలాగ తల మీద ధరింపవచ్చు . కానీ , ఆసక్తి కలిగించి మూర్ఖుని మనసును సమాధాన పెట్టడం మాత్రం సాధ్యం కాదు .
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం