తాజా కథలు @ CCK

తెలియని వస్తువులతో ఆటలాడరాదు.ఆపదలు కొనితేచ్చుకోరాదు

2015-06-04 07:05:01 చిన్నారుల కథలు
ఓ రోజు వడ్రంగులు , మేస్త్రీలు ఓ అందమైన భవంతిని నిర్మించడం ప్రారంభించారు .అందరూ ఎంతో శ్రద్ధతో వారి వారి పనులు చేస్తూ ఉండగా వృక్షాల పైనుండి కొన్ని కోతులు చూస్తున్నాయి . కొద్దిసేపటి తర్వాత అందరూ భోజనం చేయడానికి వెళ్ళారు .
రాజయ్య అనే వడ్రంగి మాత్రం పనిలో ఉండిపోయాడు .అతనొక పెద్ద దుంగను రెండు ముక్కలు నిలువుగా చేద్దామనుకున్నాడు ఆ దుంగను రంపముతో కోయనారంబించాడు

అయితే ! అక్కడే ఒక వృక్షంపై వున్నకోతుల్లో ఒకటి రాజయ్య చేసే పనిని గమనిస్తూ వుంది .కొద్దిసేపటి తరువాత రాజయ్యకి ఆకలి అయింది .పని ఆపి , భోజనం చేయడానికి వెళ్ళాడు .రాజయ్య దుంగను సగం మాత్రమే కోసాడు .కోయవలసినది ఎక్కడి నుండో తెలియడానికి గుర్తు కొరకు ఆ ప్రదేశంలో ఒక ఇనుప మేకును దిగ్గొట్టాడు.

రాజయ్య వెళ్ళిపోగానే ,కోతి వృక్షంపై నుండి కిందకు దిగి , ఆ దుంగ చుట్టూ తిరిగి , రాజయ్య చేసిన పనిని గమనించింది . దుంగకు మధ్యలో దిగ్గొట్టిన ఇనుప మేకును రెండు చేతులతో బలంగా బయటకి లాగసాగింది . దాని తోక దుంగ చీలిక మీద వేలాడుతుంది .అలా ఊపుతుంటే కోతి చేతిలోని ఆ మేకు ఊడి వచ్చింది .దాంతో దుంగ కోసిన రెండు సగాలు గట్టిగా కొట్టుకొని కలిసిపోయాయి .

కోతి తోక ఆ దుంగ ముక్కల మధ్యన చిక్కుకుపోయింది .దుంగ రెండు సగాలు కొట్టుకోవడం వల్ల కోతి తోక బాగా నలిగిపోయింది . గట్టిగా అరుస్తూ కోతి బలంగా తోకను లాక్కుంది . దాంతో తోక తెగిపోయింది . తెగిపోయిన పొడవైన భాగం ఆ దుంగలో ఇరుక్కుపోయి అలానే ఉండిపోయింది .

నీతి  :

తెలియని వస్తువులతో ఆటలాడరాదు.ఆపదలు కొనితేచ్చుకోరాదు .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం