తాజా కథలు @ CCK

లోకజ్ఞానం

2015-06-17 13:05:01 చిన్నారుల కథలు
ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉండేవారు . చదువు పూర్తి కావటంతో ఒకరోజు నలుగురూ ఉద్యోగాల నిమిత్తం పట్నానికి ప్రయాణమయ్యారు . నలుగురిలో ముగ్గురు చదువులో అందరికంటే ముందు ఉండేవారు .
నాలుగోవాడు గోపాలుడికి చదువు అంతగా అబ్బలేదు . కానీ , లోకజ్ఞానం మాత్రం చాలా వుండేది . నీ చదువుకు తగ్గ ఉద్యోగం పట్నంలో దొరక్కపోవచ్చు . నువ్వు ఊరిలోనే ఉండి ఏవైనా పనులు చూస్కోమని మిగతా ముగ్గురూ ఎంత చెప్పినా వినిపించుకోకుండా వారితో ప్రయాణమయ్యాడు గోపాలుడు .

అడవిలో ప్రయాణిస్తుండగా దారిలో వారికి చచ్చి పడివున్న జింక కనిపించింది .

మొదటివాడు " ఈ చర్మాన్ని ఇంటికి తీసుకెళ్ళి గోడకు అలంకరిస్తే ఇంటి అందం పెరిగిపోతుంది " , అంటూ సంబరపడ్డాడు .

రెండోవాడు " ఈ జింక చర్మం లోపల ఎందు గడ్డి పెట్టి కుట్టేస్తే అసలు జింకే వున్నట్లు ఉంటుంది " , అని పొంగిపోయాడు .

మూడోవాడు " ఈ జింక చర్మాన్ని పక్కన పెట్టుకొని దాన్ని చూస్తూ అందమైన జింక బొమ్మ గీసేస్తాను " , అంటూ మురిసిపోయాడు .

గోపాలుడు మాత్రం వీరి మాటలను పట్టించుకోకుండా కంగారుగా అటూ ఇటూ చూస్తూ " ఈ చుట్టుప్రక్కల పులి తిరుగుతుందని నాకు అనుమానంగా వుంది . వెంటనే మనం ఇక్కడి నుండి బయట పడాలి " , అంటూ తొందరపెట్టాడు .

వాళ్ళు వెళ్ళే దారిలో వెళ్ళిన కాసేపటికే దూరంగా పులి గాండ్రింపు కూడా వినిపించింది .

గోపాలుడి లోకజ్ఞానం వల్లే తాము ప్రాణాలతో బయటపడ్దామని ముగ్గురు స్నేహితులూ ఎంతో సంతోషించారు .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం