తాజా కథలు @ CCK

మూర్ఖులకు మంచి చెప్పినా ముప్పు రావచ్చు !

2015-06-10 03:05:01 చిన్నారుల కథలు
పూర్వం దండకారణ్యంలో ఒక చెట్టు మీద సూచీముఖం అనే ఒక పక్షి నివాసం వుండేది . దానికి ఇతరులకు సహాయపడాలన్న సద్భుద్ది ఉండేది . ఆ చుట్టుప్రక్కల చెట్ల మీద కొన్ని కోతులు కుడా నివాసం ఉండేవి . రొజూ ఉదయాన్నే సూచీముఖం నిద్ర లేచి ఆహారం కోసం ఎక్కడెక్కడో తిరిగి ఆహారం తిని సాయంత్రానికి ఇంటికి వచ్చేది .

ఒకసారి వర్షాకాలం ముగిసి చలికాలం వచ్చింది . కోతులు ఆ చలికి తట్టుకోలేకపోసాగాయి . మంట వెలిగించడం రాదు . మరి ఎలా ? అని కోతులు ఆలోచిస్తున్నాయి . మధ్యాహ్నమన్థా ఎండా బాగానే ఉన్నా రాత్రవుతున్నాకోద్దీ చలి తీవ్రత పెరిగిపోసాగింది . పైగా అది అడవి . కాబట్టి సహజంగానే చలి విపరీతంగావుంటుంది .

అప్పుడప్పుడు ఆ దారిలో వెళ్ళే మనుషులు చలి కాచుకోవడానికి మంట వేసుకోనేవాళ్ళు . ఆ మంటను చూసి కోతులు మనం కూడా మంట వేసుకుంటే బాగుండేది అని అనుకునేవి . కాని , మంట వెలిగించడానికి ఏమీ లేవు కదా ! దాంతో అవి తమలో తాము ఎంతో మధనపడిపోతున్నాయి .

సూచీముఖం రోజు కోతులను కనిపెడుతూనే వుంది . రాత్రిపూట మిణుగురు పురుగులు ఎగురుతూ వుంటే వాటి శరీరం నుంచి వచ్చే వెలుతురును చూసి కోతులు అది మంట అనే అనుకునేవి . ఒక రోజు రాత్రిపూట కోతులన్నీ ఒక్కొక్కటిగా మిణుగురు పురుగులను ఒక చోట కుప్పగా పోశాయి . మిణుగురు

పురుగులు శరీరం నుండి వెలువడే వెలుగునే అవి మంట అనుకోని ఆ పురుగులు చుట్టూ చేరి చలి కాచుకుంటున్నాయి .
సూచీముఖం కోతులు చేస్తున్నదంతా గమనిస్తూనే వుంది . దానికి నవ్వొచింది . ఈ కోతులు ఎంత తెలివి తక్కువవి ! . మిణుగురు పురుగులు శరీరం నుండి వెలువడే వెలుగునే అవి మంట అనుకుంటున్నాయి . పైగా చుట్టూ చేరి చలిమంట కాచుకుంటున్నాయి . అని తనలో తానే నవ్వుకుంది .

ఒక రోజు రాత్రి కోతులన్నీ ఎప్పటిలాగే మిణుగురు పురుగులను ఒక చోట కుప్ప పోసి చలికాచుకుంటున్నాయి . సూచీముఖం అది చూసి ఊరికే ఉండలేకపోయింది . కోతులకు వాస్తవ విషయం చెప్పాలని అనుకుంది . అయ్యో ! కోతులారా ! మీరు చలి కాచుకున్టున్నది నిజంగా మంట కాదు , అవి మిణుగురు

పురుగులు . ఆ పురుగుల నుండి వెలువడేది వెలుగు మాత్రమే . ఆ వెలుగుకు వేడి వున్తున్ధనుకొని భ్రమ పడుతున్నారు . కట్టెపుల్లలను కాల్చితే మంట వస్తుంది . ఆ మంటకు వేడి వుంటుంది . అంతేకాని ! ఈ మిణుగురు పురుగులకు వేడిమి ఎక్కడిది ? అంది నవ్వుతూ ..... కోతులన్నీ సూచీముఖం చెప్పినమాటలు విన్నాయి .

ఈ పక్షి ఏమిటి ? మాకు సలహాలు ఇస్తుంది , అని అనుకున్నాయి . మళ్ళీ సూచీముఖం ఇలా అంది , కోతులారా ! ఇందాకే ఈ దారి వెంట వెళ్ళిన మనుషులు ఇక్కడ మంట వేసుకొని చలి కాచుకున్నారు కదా ! అక్కడ చూడండి ఇంకా నిప్పు వుంది . అందులో కొన్ని కట్టె పుల్లలు తెచ్చివేయండి . మంట వస్తుంది . మీకు చలి భాద తీరుతుంది , అని అంది . కోతులన్నీ సూచీముఖం వైపు ఆశ్చర్యంగా , అసహనగా చూశాయి .

సూచీముఖం మళ్ళీ ఇలా అంది . ఇంకా చూస్తారేం ! మీరు ఎంతసేపు ఆ మినుగురుపురుగుల వద్ద కూర్చున్నా ఏం లాభం ? అక్కడ వేడిమి ఉండదు , అని అన్నది . కోతులకు కోపం వచ్చింది . వాటిలో ఒకటి తెలివిగా సూచీముఖంతో , ఆ మంట ఎలా వేయాలో కాస్త మా దగ్గరికి వచ్చి చూపించారాదూ ! అని అడిగింది .

తనను సలహా అడిగారన్న ఉత్సాహంతో సూచీముఖం పాపం కోతుల దగ్గరికి వెళ్ళింది అమాయకంగా ! అప్పటికే బాగా కోపంతో వున్న కోతులు ఒక్క ఉదుటున సూచీముఖాన్ని గట్టిగా పట్టుకున్నాయి . ఓయ్ ! మేము నీకన్నా పెద్ద జంతువులం . నీవేమో వేలడంత లేవు ! అయినా మాకు సలహాలు ఇస్తున్నావు .

నీకున్నపాటి బుద్ధి మాకు లేదా ఏమిటి ? అని కోతులు కోపంగా అని , తమకు మంచి చెప్పబోయిన సూచీముఖం మెడ పట్టుకొని చంపేశాయి .

కాబట్టి ! మూర్ఖులకు హితము చెప్పరాదు . సలహా ఇవ్వరాదు . ఎందుకనే బుద్ధుహీనులకు , మంచివాళ్ళు చెప్పిన మాటలను వినరు . పైగా వారివల్ల , బుద్ధివంతులకు ప్రాణహాని ఏర్పడుతుంది . కాబట్టి , దుష్టులకు , బుద్ధిహీనులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం . లేదంటే సూచీముఖానికి పట్టిన గతే మంచివారికీ పడుతుంది .

నీతి :
మూర్ఖులకు మంచి చెప్పినా ముప్పు రావచ్చు !

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం