తాజా కథలు @ CCK

నిజమైన యోధుడికి కావాల్సింది ధైర్యసాహసాలే కాని ఆయుధాలు కావు

2015-06-03 01:05:01 చిన్నారుల కథలు
మాళవ దేశాన్ని పాలించే ధీరేంద్రవర్మ గొప్ప ధైర్యవంతుడూ , తెలివైన వాడు కానేకాదు , ప్రజారంజకంగా పాలించే రాజుగాను పేరు సంపాదించుకున్నాడు . తండ్రి నుండి వారసత్వంగా పొందిన రాజ్యాన్ని తన శక్తి సామర్థ్యాలతో ఎంతో విస్తరించాడు .

ఏ యుద్ధంలోనైనా ధీరేంద్రవర్మగెలుపొందడం చుట్టుప్రక్కల రాజులకు మింగుడు పాడనీ సమస్యలా తయారైంది . ధీరేంద్రవర్మ వరుస విజయాలకు కారణం అతడి దగ్గర వున్నా ఖడ్గమనే అపోహ చాలా మందికి వుండేది . దాని వల్లే అతడు అన్ని యుద్ధాల్లొనూ సునాయాసంగా విజయం సాధిస్తున్నాడని అందరూ అనుకొనేవారు .దాంతో అతడి ఖడ్గాన్ని దొంగిలించాలని , అతడిని యుద్ధంలో ఓడించాలని ఇద్దరు రాజులు పథకం పన్నారు .

దానిలో భాగంగా ధీరేంద్రవర్మ దగ్గర పనిచేసే భటుడిని ప్రలోభపెట్టి ఖడ్గాన్ని సంపాదించారు .

కొద్ది రోజుల తర్వాత ఇద్దరు రాజులూ కలిసి ధీరేంద్రవర్మ మీదకు దండెత్తారు . చిన్న చిన్న కారణాలతో యుద్ధానికి దిగి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దని ధీరేంద్రవర్మ హితవు చెప్పినా వారు వినిపించుకోలేదు .

దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం చేసిన ధీరేంద్రవర్మ ఎప్పటిలాగే వీరోచితంగా పోరాడి గెలుపొందాడు .

ధీరేంద్రవర్మ విజయానికి కారణం అతడి ఖడ్గమేనని నమ్మిన రాజుల భ్రమలు అంతటితో తొలగిపోయాయి .

నిజమైన యోధుడికి కావాల్సింది ధైర్యసాహసాలే కాని ఆయుధాలు కావని వారికప్పుడు తెల్సివచ్చింది .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం