తాజా కథలు @ CCK

దురాశ దు:ఖానికి చేటు

2015-04-26 09:05:01 చిన్నారుల కథలు
గంగయ్య , మంగయ్య అనే ఇద్దరు మోసగాళ్ళు వుండేవారు . అయితే ! వీరు అమాయకులను దోచుకునే వారిని మాత్రమే దోచుకునేవారు .
వారికి కిరాణా కొట్టు శెట్టి అమాయకుల్ని పీడిస్తున్నాడని తెలిసింది .
మరునాడు , అయ్యా ! నా పేరు మంగయ్య . కష్టపడి వెయ్యి వరహాలు కూడబెట్టాను . కాశీకి పోయిరావాలని వుంది . తిరిగి వచ్చే వరకూ ఈ డబ్బు మీ దగ్గర దాచుకుందామని వచ్చాను , అన్నాడు .
అలాగా ? పరుల సొమ్ము పాము లాంటిది . దాన్ని నా చేతులతో తాకను . నువ్వే నా పెరట్లో గొయ్యి తీసి పాతిపెట్టుకొని గుర్తుపెట్టుకో ! అన్నాడు శెట్టి .
ఆహా ! ధర్మాత్ములు . మీరు చెప్పినట్టే చేస్తాను ,అన్నాడు మంగయ్య .
తెల్లారి శెట్టి , నేను ఎవరి మొహం చూశానో కానీ వెయ్యి వరహాలు లాభామన్నమాట ! అని అనుకున్నాడు .
ఆ రాత్రి శెట్టి పెరట్లోని మూటను తవ్వి తీసి కుమ్మరించాడు . అయ్యో ! వట్టి చిల్లపెంకులు ! ఎంత మోసం ! అనుకున్నాడు .
మరునాడు గంగయ్య , శెట్టి ఇంటికి వచ్చాడు . అయ్యా ! కాశీకి బయల్దేరాను . కష్టపడి కూడబెట్టిన అయిదివేల వరహాలు తమ దగ్గర దాచుకుందామని వచ్చాను , అన్నాడు .
చిర్రెత్తిపోయిన శెట్టి కోపంగా అరిచాడు . అయిదువేల వరహాలా ? చిల్లపెంకులా ?
అయిదువేల వరహాలే ! కావలిస్తే చుడండి అని , అన్నాడు గంగయ్య .
సంచిని కుమ్మరించాడు గంగయ్య . గలగలమంటూ వరహాలు రాలాయి .
శెట్టి , నిజంగానే వరహాలూ ! సరే వెళ్లి పెరట్లో పాతిపెట్టమన్నాడు .
ఇంతలో మంగయ్య అక్కడికి వచ్చాడు . వీడేమిటి , ఇప్పుడు వచ్చాడు . కాశీకి పోలేదా ? అని మనసులో అనుకున్నాడు శెట్టి .
వరదల వల్ల కాశీకి వెళ్ళే మార్గం బాగా లేదట . వచ్చే ఏడు వెళ్తాను . మీరు అనుమతిస్తే నా డబ్బు తీసుకుపోతాను , అని అన్నాడు మంగయ్య .
వీడి సంచిలో చిల్లి పెంకులున్నాయంటే వాడు అయిదువేల వరహాలు దాచుకోడు .వీడికి వెయ్యి వరహాలు ఇచ్చేస్తే , వాడు అయిదువేల వరహాలు దాస్తాడు .వాటిని కాజేస్తే నాలుగు వేలు లాభం , అని ఆలోచిస్తున్నాడు శెట్టి .
శెట్టిగారు ఏదో ఆలోచిస్తున్నారు అన్నాడు మంగయ్య .
ఇదిగో నీ వెయ్యి వరహాలు సరిగా ఉన్నాయో ? లేదో ? లెక్క చూసుకో , అన్నాడు శెట్టి . పరుల సొమ్మును చిల్లపెంకులా చూసే మిమ్మల్ని లెక్క సరిచూసి అవమానిన్చాగాలమా ! అన్నాడు మంగయ్య .
మంగయ్యను అప్పుడే చూసినట్టు చూసి ...
ఎవరూ ? మంగయ్యేనా ? కాశీకి వెళ్తున్నావుగా , వెళ్ళలేదా ఏమిటి ? అడిగాడు గంగయ్య .
లేదన్నా. వరదల వల్ల దారి బాగాలేదట . వచ్చే ఏడు వెళ్తాను , అన్నాడు మంగయ్య .
అయితే ! వచ్చే ఏడు ఇద్దరం కలిసి వెళ్దాం . శేట్టిగారూ ! వచ్చే ఏడు మేమిద్దరం మీ దగ్గరే డబ్బు దాచుకుంటాము . ఇక సెలవు ఇవ్వండి , అన్నారు ఇద్దరూ .
అయ్యో ! నా వెయ్యి వరహాలు పోయినట్టేనా ? అని విచారించాడు.

నీతి :

దురాశ దు:ఖానికి చేటు .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం