తాజా కథలు @ CCK

అసలు పనివాడు

2015-06-13 11:05:01 చిన్నారుల కథలు
అక్బర్ రాజ్యంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతని పనివాడు ఒకరోజు దొంగతనం చేసి, నగలు, రొక్కం తీసుకుని పారిపోయాడు.

కొన్ని రోజులయ్యాక, ఒకసారి ధనవంతుడు బజారులో తన పనివాడిని తిరుగుతూ చూసాడు. ఆ పనివాడు కూడ ధనవంతుడిని చూసాడు. యెక్కడా పారిపోవడానికి దారి లేదని గ్రహించి, వెంటనే ఆ ధనవంతుడిని గట్టిగా పట్టేసుకున్నాడు.

“ దుర్మార్గుడా ! దొరికావు . ఇప్పుడెలా పారిపోతావు ? దొంగతనం చేస్తే వదిలేస్తాను అనుకున్నావా ? నా నగలు, రొక్కం తిరిగి ఇవ్వు ” , అని అరవడం మొదలుపెట్టాడు.

ధనవంతుడు నిర్ఘాంత పోయాడు. “ నేను దొంగతనం చేయడం యేమిటి ? వెంటనే నా సొమ్ము నాకు ఇవ్వకపోతే నిన్ను రాజభటులకు పట్టిస్తాను ” , అని గొడవపడసాగాడు.

బజారులోని కొందరు పెద్దమనుషులు ఇద్దరిని బీర్బల్ దగ్గరకి న్యాయం కోసం తీసుకువెళ్ళారు.

బీర్బల్ యెదుట , ఇద్దరు వారి వారి కథలను మళ్ళి చెప్పారు.

బీర్బల్ వెంటనే ఒక భటుడిని పిలిచి, “ ఇద్దరిని ఒక కిటికీ దగ్గిరకి తీసుకెళ్ళి అందులోంచి తలలను బయట పెట్టమను ” , అన్నాడు.

ఇద్దరు కిటికి బయట తలలు పెట్టాక, బీర్బల్ , “ ఇప్పుడు పనివాడి తల నరికేయి ” అని ఆదేశించాడు.

ఈ మాట వినంగానే అసలు పనివాడు ఖంగారుగా తన తల లోపలకు లాగేసాడు. ఇలా బయటపడిపోయాడు.

ఇలా బీర్బల్ మళ్ళీ అతని చాకచక్యం ప్రదర్శించుకున్నాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం