తాజా కథలు @ CCK

గమ్మత్తైన సమస్య

2015-05-31 07:05:01 చిన్నారుల కథలు
ఒక చమురు వ్యాపారికి, కసాయి వాడికి చాల పెద్ద గొడవయింది. విషయం తేలక ఇద్దరు బీర్బల్ దగ్గరకు వెళ్ళారు.

తగువు తీర్చమని బీర్బల్ని అడిగారు.

“ అసలు గొడవ యేమిటి ? ” అని బీర్బల్ అడిగాడు.

అప్పుడు కసాయి వాడు ఇలా చెప్పాడు, “ నేను మాంసం అమ్ముకుంటుంటే ఈ చమురు వ్యాపారి నా దుకాణానికి వచ్చి చమురు పోస్తానన్నాడు. పాత్ర తీసుకు రావడానికి నేను లోపలకి వెళ్ళినప్పుడు ఇతను నా నాణాల సంచి తీసుకుని అది తనదే అని గొడవ చేస్తున్నాడు. నా డబ్బు సంచి నాకు ఇప్పించండి ”.

వెంటనే ఆ చమురు వ్యాపారి, “ లేదు ! అతను చెప్పేవన్నీ అబద్ధాలు. ఆ సంచి నాదే. నేను నాణాలు సంచి లోంచి తీసి లెక్ఖ పెడుతున్నాను. అది చూసి ఇతను దురాశతో నా సంచి కాచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. న్యాయం చెప్పండి ” , అన్నాడు.

బీర్బల్ యెన్నిసార్లు అడిగినా వాళ్ళిద్దరు చెప్పిన మాటే మళ్ళి మళ్ళి అదే మాట చెప్పసాగారు.

ఈ  సమస్యకి బీర్బల్ ఒక యుక్తిని అలోచించాడు.

ఒక పెద్ద పాత్రలో నీళ్ళు తెప్పించాడు. ఆ నీళ్ళల్లోకి సంచిలో నాణాలు వేశాడు. వెంటనే ఆ పాత్రలో నీళ్ళ పైన పలచగా నూనె తేలింది.

ఆ తెట్టు చూసిన వెంటనే ఆ సంచి చమురు వ్యాపరిదని అందరూ గ్రహించారు.

బీర్బల్ సంచిలో మళ్ళి నాణాలు నింపి చమురు వ్యాపరికి ఇచ్చేసాడు. ఆ కసాయిని కఠినంగా శిక్షించాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం