తాజా కథలు @ CCK

త్రుప్తిని మించిన సంపద లేదు

2015-05-24 09:05:02 చిన్నారుల కథలు
సుందరం భార్యాపిల్లలతో సామాన్య జీవితం గడుపుతున్నాడు . ఉన్నదాంట్లో సంతృప్తి చెందే మనస్తత్వం తనది .

భార్య సావిత్రి మాత్రం భర్త గుణానికి విరుద్ధంగా వుండేది . ఇరుగుపొరుగు వారిని చూసి వారిలా హుందాగా బతకాలని , తన కోరికలతో భర్తను ఇబ్బంది పెట్టేది .

ఒకరోజు వాళ్ళింటికి చుట్టాలు వచ్చారు . వాళ్లకు పిండి వంటలు వండి పెడితే ఘనంగా వుంటుంది ,అనుకుంది సావిత్రి . భర్తతో విషయం చెప్పింది . " అద్దె , ఇతరత్రా ఖర్చులు పోనూ నా దగ్గర మిగిలింది చాలా తక్కువ . మనము ఎం తింటున్నామో , వాళ్ళకూ అదే పెడదాం ", అని భార్యకు నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు .

మన బతుకులు ఎప్పుడూ ఇంతే ! పక్కింటి మహాలక్ష్మిని చూడండి . వాళ్ళ పుట్టింటి నుండి ఎవరు వచ్చినా నాలుగు రోజులు ఇంట్లో పండగే . మా వాళ్లకు మాత్రం ఏమీ పెట్టకుండా పంపాలా ? మనం లేని వాళ్ళమని ఇరుగుపొరుగు వాళ్ళు చిన్నచూపు చూస్తున్నారు , అని భర్తను దెప్పిపొడిచింది సావిత్రి .చేసేదేమీ లేక అప్పు చేసి మరీ కిరాణా కొట్టుకెళ్ళి కావలసినవి కొనుక్కొచ్చాడు . బంధువులకు మర్యాదలు చేశారు .

ఇలాగైతే ! లాభం లేదనుకొని , భార్య విపరీతమైన ఖర్చులకు కళ్ళెం వేయాలని ఒక ఉపాయం ఆలోచించాడు .
మర్నాడు ఉదయమే సుందరం వాళ్ళింటికి యజమాని వచ్చాడు . చాలా రోజుల నుండి చెబుతున్నా మీరు అద్దె పెంచట్లేదు . ఈ నెల నుండి మీ అద్దె రెట్టింపు చేస్తున్నా , అని చెప్పాడు . మేము అంత భరించలేము అని చెప్పాడు సుందరం . అయితే ! ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు యజమాని .

వెంటనే , సుందరం కుటుంబమంతా పట్టణం శివార్లలో చవకగా వున్న ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అందులోకి మారారు . అక్కడ చుట్టుప్రక్కల వారంతా చిన్న చిన్న ఇళ్ళలో వుండే పేదలే . దాంతో సుందరం కుటుంబం వారి కన్నా మంచి ఆర్ధిక స్థితిలో ఉండటంతో అంతా గౌరవించేవారు . ఇరుగుపొరుగు మహిళలు కుడా సావిత్రితో స్నేహంగా మేదిలేవారు . పైగా చుట్టుప్రక్కల వారంతా చాలా నిరాడంబరంగా , ఉన్నదాంట్లో బతకడం చూసి సావిత్రి కుడా ఖర్చులు తగ్గించుకుంది .

చూశావా ! మనం కుడా ఎప్పుడూ గొప్ప వాళ్ళతో పోల్చుకొని భాధపడకూడదు . మన కన్నా తక్కువ స్థాయి వాళ్ళతో ఎంతో మంది ఉంటారనే నిజం గ్రహించాలి . త్రుప్తిని మించిన సంపద ఈ ప్రపంచంలో వేరొకటి లేదు , అన్నాడు సుందరం తన భార్య సావిత్రితో . భర్త మాటలను నవ్వుతూ అంగీకరించింది సావిత్రి .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం