తాజా కథలు @ CCK

వ్యాపారి దుర్భుద్ధి - నౌకరు అమాయకత్వం

2015-05-26 11:05:01 చిన్నారుల కథలు
పల్లెలో పనిలేక పట్నం బాట పట్టాడు బాలాజీ . అమాయకంగా అంగడి వీదిలోనుంచి వెళుతుంటే గాజు వస్తువుల దుకాణం నడిపే కోటగిరి చూశాడు . " వేడిని ఎలాగోలా బోల్తాకోట్టించి జీతం ఇవ్వకుండా పనిలో పెట్టుకోవాలి " అని మనసులో అనుకొని పిలిచాడు .
బాలాజీ వివరాలు చెప్పి , పనికోసం వెతుకుతున్నట్టు చెప్పాడు . " నిన్ను పనిలో పెట్టుకుంటాను గానీ , ముందు ఆ అల్మారాలో వున్న గాజు జాడీ తీసుకురా " అన్నాడు .

అది గతంలోనే పగిలిపోతే ముక్కలు కలిపి జాగ్రత్తగా ఉంచాడు . బాలాజీ పట్టుకోగానే అది విరిగి కిందపడి పగిలింది .

" పదివేలు విలువ చేసే జాడీని పగలగొట్టావు . డబ్బులు ఇవ్వు " కోపంగా అన్నాడు .

అయ్యా ! నా దగ్గర అంత డబ్బు లేదు . బాలాజీ భయంతో అమాయకంగా అన్నాడు .

అయితే ! నా దగ్గర ఏడాదిపాటు పనిచేయాలి . అన్నం మాత్రం పెడతా , అన్నాడు కోటగిరి .బాలాజీ ఒప్పుకున్నాడు .
నెలకు నాలుగువేలు ఇచ్చినా దొరకని నౌకరు , కేవలం భోజనం పెడితే దొరుకుతున్నాడు , అనుకొని దుకాణంతోపాటు , ఇంటి పనిని కూడా చేయించుకొనేవారు .

ఏడాది దగ్గరకు వచ్చింది . ఇంతలో ఒకరోజు కోటగిరి బయటకేల్లోచ్చేసరికి నాలుగు జాడీలు పగిలిపోయి ఉన్నాయి .
కోటగిరి వాటిని చూసి బాలాజీపై అరుస్తూ " నీ పని చెబుతా " అంటూ న్యాయాధికారి దగ్గరకు తీసుకెళ్ళాడు .

నౌకరును పెట్టుకుంటే నా విలువైన సామాను అంతా పగులగొట్టాడు . విచారించి తగిన శిక్ష విధించండి ,అని ఫిర్యాదు చేసాడు .
బాలాజిని ప్రశ్నించగా " అయ్యా ! మా యజమాని బజారులో వెళుతున్న నన్ను పిలిచి , అల్మారాలో వున్న గాజు జాడీని తెమ్మన్నాడు . అది పట్టుకోగానే పగిలిపోయింది . అందుకు పరిహారంగా ఏడాది పనిచేసాను .ఆయనే భోజనం పెట్టాడు . ఇప్పుడు గడువు తీరింది . నేను బయటకెలితే పనెక్కడ దొరుకుతుంది ? అందుకే మరో నాలుగు జాడీలను పగలగొట్టాను , అని వివరించాడు బాలాజీ .

న్యాయాధికారి , బాలాజీ అమాయకత్వం , కోటగిరి దుర్భుద్దిని పసిగట్టాడు .

నువ్వు ఇతడి అమ్మయకత్వాన్ని ఆసరా చేసుకొని ఏడాదిపాటు చాకిరీ చేయిన్చుకున్నావ్ .అతను భోజనం కోసం ఆశపడి నీ దగ్గరే పనిచేయాలనుకొని జాడీలు పగలగొట్టాడు . నెలకు నాలుగు వేలు ఇవ్వనిదే నౌకరు దొరకడు . కానీ , నువ్వు భోజనం మాత్రమే పెట్టావు . కాబట్టి , ఏడాది భోజనం ఖర్చులు పోనూ బాలాజీకి ఇరవైవేల రూపాయలు ఇవ్వు , అని న్యాయాధికారి తీర్పు చెప్పాడు .

తాను తీసుకున్న గోతిలో తానే పడ్డానని తెలుసుకొని కోటగిరి చేసేదేమీ లేక బాలాజీకి డబ్బిచ్చి పంపాడు .

ఆ డబ్బుతో మళ్ళీ ఊరెళ్ళి గేదెలు కొనుక్కొని పాల వ్యాపారం ప్రారంభించాడు బాలాజీ .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం