తాజా కథలు @ CCK

వైద్యుడి తెలివి

2015-02-09 14:26:17 చిన్నారుల కథలు
జమీందారు రాజయ్య రోజు పంచభక్ష్య పరమాన్నాలతో భోoచేసేవాడు .దాంతో చాలా లావై అడుగు వేయడానికి ఎంతో కష్టపడేవాడు . ఒకరోజు ఎలాగైనా సన్నగా అవ్వాలని వైధ్యుల్ని సంప్రదించాడు . తిండి తగ్గించి వ్యాయామం చేస్తే ఫలితం ఉంటుందని చెప్పారు . కానీ , దానికి రాజయ్య అంగీకరించకుండా మందులే కావాలన్నాడు . దాంతో , వైద్యులు రకరకాల మందులు ఇచ్చారు . జమీందారు వాటన్నిటినీ వేసుకున్నాడు . కానీ , ఏ మార్పూ లేదు .

కొన్నాళ్ళ తర్వాత కొత్త వైద్యుడొకరు వచ్చి జమీందారుని పరిశీలించి .... " మీ ఆరోగ్యం బాగాలేదు . ఎన్నో రోజులు బతకరు . మిమ్మల్ని దేవుడే రక్షించాలి " అని చెప్పారు . దేవుడే రక్షించాలన్న మాటల్ని విన్న జమీందారు భార్య వెంటనే భర్తతోపాటు గుడికి వచ్చి ప్రదక్షిణలు చేస్తానని దేవుళ్ళకు మొక్కుకుంది .అదీ , జమీందారుకి వినబడేలా .....జమీందారు కూడా ఎందరో వైద్యుల్ని చూశాక ఈ వైద్యుడు చెప్పింది నిజం కావచ్చు అనుకున్నాడు . చేసేదేమీ లేక సరేనన్నాడు .

రొజూ కొండల మీద ఉన్న ఆలయాలకు నడిచి వెళ్ళడం , గుళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేసేవాడు . ఉపవాసాలు ఉండేవాడు . జమీందారు కొన్ని రోజులకు సంనాబడ్డాడు .

ఈ మార్పునకు కారణం దేవుడేనని జమీందారు అందరికీ చేబుతూండగా ...." దేవుడే కాదు ,ఆ వైద్యుడు కూడా అని " చెప్పింది అతడి భార్య . ఎలా ? అని అడిగాడు జమీందారు . " దేవుడి మీద భారం వేయకపోతే మీరు ఈ గుళ్ళూ , గోపురాలూ తిరగరు . ఫలితంగా మీ శరీరానికి కదలిక ఉండదు . మీరు సంనబదేవారే కాదు . వైద్యుడు ఆ విషయం నాతో చెప్పి ఇదంతా నాతో చేయించాడు " అని చెప్పిందామె . ఆ వెంటనే వైద్యున్ని పిలిచి విలువైన కానుకలు ఇచ్చి పంపాడు జమీందారు .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం