తాజా కథలు @ CCK

కష్టేఫలి

2015-03-27 21:05:01 చిన్నారుల కథలు
రామాపురంలో రామయ్య అనే శిల్పి ఉండేవాడు .శిల్పిగా అతడికి చాలా మంచి పేరుంది . ఒకరోజు పని పూర్తిచేసుకొని త్వరగా ఇంటికి బయలుదేరి వస్తుంటే మార్గం మధ్యలో అతడికి పెద్ద పెద్ద రాళ్ళు కనిపించాయి . వాటిని చూడగానే రామయ్యాకు వాటిపైన చక్కని శిల్పం చెక్కాలనిపించింది.
వెంటనే ఒకదాని మీద ఉలితో చెక్కడం మొదలుపెట్టాడు . ఒకదెబ్బ పడీ పడగానే రాయి - " నేనీ ఉలి దెబ్బలు తినలేను . నన్ను ఇలానే ఉండనివ్వు " అంటూ మొరపెట్టుకుంది . దాంతో దాన్ని వదిలేసి పక్కనే ఉన్న మరో రాయి పైన దేవుడి రూపం చెక్కాడు . ఈలోగా రాత్రి అవ్వడంతో ఇంటికి వెళ్ళిపోయాడు .

మర్నాడు అదే దారిలో వెళుతున్న రాజు రాతి పైన ఉన్న దేవుడి రూపాన్ని చూశాడు .అంత చక్కనైన దేవుడి రూపాన్ని బయట వదలడానికి ఆయన మనసొప్పలేదు .దాన్ని గుడిలో ప్రతిష్టించాలనుకున్నాడు . అందుకోసం ఒక ఆలయాన్ని కట్టించాల్సిన్దిగా మంత్రిని ఆదేశించాడు .

మంత్రి రాజాజ్ఞ ప్రకారం రాజధాని నడి ఒడ్డున కట్టించే ఏర్పాట్లు మొదలు పెట్టాడు . మరోవైపు రామయ్యను పిలిచి విగ్రహానికి మరిన్ని మెరుగులు దిద్ధమన్నాడు రాజు . కొద్ది రోజుల్లోనే రామయ్య ఆ పని పూర్తిచేశాడు . గుడి నిర్మాణం కూడా పూర్తయింది .
పనిలో పనిగా వాళ్ళు దేవుడి రూపంలోకి మారిన శీలా పక్కనే ఉన్న రాయిని కూడా గుడి దగ్గర మెట్టులా పనికి వస్తుందని గుడికి తరలించారు . శిల్పి ఉలి దెబ్బ వేసినపుడు దెబ్బలు తినలేనన్న రాయి అదే . అలా , కష్టాన్ని ఓర్చుకున్న రాయి దేవుడి రూపంలో నిత్యం పూజలు అందుకోసాగింది .ఉలి దెబ్బకు బయపడిన రాయి మెట్టు రూపంలో అందరి కాళ్ళ కింద అణిగిపోయింది .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం