తాజా కథలు @ CCK

ఆశ్రమ బాధ్యత - ఉత్తమ విద్యార్ధి

2015-06-18 15:05:01 చిన్నారుల కథలు
యమునా నదీ తీరంలో రామానంద స్వామి గురుకులం ఉండేది. ఆయన విద్యతోపాటు వినయ విదేయథలూ ,విలువలూ బోధిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దేవారు . అందుకే ధనికులూ, పేదవాళ్ళు అనే తేడా లేకుండా ఆ గ్రామం లోని వాళ్ళే కాకుండా ఇతర ప్రాంతాల వాళ్ళూ తమ పిల్లల్ని ఆయన గురుకులంలోనే చేర్చేవారు .

విద్యార్థులకు సంధర్బోచితంగా సత్యము ,  అహింసల  గొప్పతనాన్ని వివరిస్తూ వారిని అన్ని విధాలా ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిచేవారు .

తన తర్వాత ఆశ్రమ బాధ్యతలు ఎవరికీ అప్పగిస్తే బావుంటుందోనని తర్జనభర్జన పడుతున్న స్వామీజీకి సునందుడు , చైతన్యుడు కాళ్ళ ముందు మెదిలారు . విద్యార్జనలో తరగతిలో ఎప్పుడూ వారే ముందుండేవారు .వారిద్దరిలో ఒకరిని ఎంపిక చేసి ఆశ్రమాని అప్పగించాలనుకున్నారు .

ఒకరోజు ఇద్దరిని పిలిచి తన కోసం జింక చర్మం తీసుకురావల్సిందిగా కోరారు .జింక చర్మం కోసం ప్రయత్నించిన సునందుడికి అది ఎక్కడా కనిపించకపోవడంతో ఒత్తి చేతులతో తిరిగి ఆశ్రమానికి వచ్చాడు .చైతన్యుడు మాత్రం అడవికి వెళ్లి జింకను వేటాడి చంపి ఆ చర్మాన్ని తీసుకొచ్చాడు .

ఇద్దరినీ పిలిచి అసలు విషయం వివరించారు స్వామీజీ . " నా తర్వాత ఆశ్రమ బాధ్యతలు మీ ఇద్దరిలో ఒకరికి అప్పగించాలనే ఉద్దేశ్యంతో పెట్టిన పరీక్షలో సునందుడే విజయం సాధించాడు . నేను బోధించిన అహింసా ధర్మాన్ని తప్పనిసరిగా పాటించడం వల్లే అతడు జీవహింసకు పాల్పడలేదు .నా తర్వాత ఆశ్రమ బాధ్యతలు స్వీకరించడానికి సునందుడే అర్హుడు ".అంటూ తన నిర్ణయాన్నిప్రకటించారు రామానంద .

ఆ తర్వాత కాలంలో సునందుడు కూడా గురువుగారు బోధించిన విలువను పాటిస్తూ ఆశ్రమంలోని విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాడు .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం