తాజా కథలు @ CCK

గోల్కొండ వజ్రం - వర్ణరహిత వజ్రం

2015-05-08 15:05:02 చిన్నారుల కథలు
ప్రపంచ ప్రసిద్ధి చెందిన వజ్రాలలో ఒకటి గోల్కొండ వజ్రం. గోల్కొండ గనుల్లో బయట పడ్డ ఈ వజ్రం ఒకప్పుడు హైదరాబాద్ చివరి నిజాం వద్ద ఉండేది. ఏప్రిల్ 17, 2013న న్యూయార్క్‌లో క్రిస్టీస్ సంస్థ నిర్వహించిన వేలంలో ఈ 76 క్యారెట్ల వర్ణరహిత వజ్రం 211 కోట్ల రూపాయల ధర పలికింది. క్లారిటీ, కట్‌, క్యారెట్‌ అనే మూడు అంశాల్లో ఎంతో విశిష్టత ఉన్న ఈ వజ్రానికి ఆర్చ్‌డ్యూక్‌ జోసెఫ్‌ డైమండ్‌ అని పేరు పెట్టారు. ఈ వజ్రానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ వజ్రం హైదరాబాద్‌లోని గోల్కొండ కోట సమీప గనుల్లో బయట పడింది. 1993లో దీనిని వేలం వేసినప్పుడు దాదాపు 57 కోట్ల రూపాయలు పలికింది. ఆర్క్‌డ్యూక్‌ డైమండ్‌తో పాటు ప్రసిద్ధి చెందిన డ్రెస్‌డెన్‌ గ్రీన్‌ డైమండ్‌, హోప్‌ డైమండ్‌, కోహినూర్‌ వజ్రం కూడా గోల్కొండ గనుల్లో లభించినవే.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం