తాజా కథలు @ CCK

హేలీ తోకచుక్క - ఎడ్మండ్‌ హేలీ

2015-04-27 17:05:01 ఖగోళ జ్ఞానం
అనంత ఆకాశంలో మిణుకు మిణుకుమనే నక్షత్రాలకు, గ్రహాలకు, భూమిమీద నివసిస్తున్న మనిషి జీవితానికి అవినాభావ సంబంధం వుందని, గ్రహాల కదలికపై మానవజీవిత మనుగడ ఆధారపడి వుందని పూర్వకాలంలో నమ్మేవారు. ఎక్కువమంది ప్రజల అజ్ఞానాన్ని అమాయకత్వాన్ని ఆధారం చేసుకొని భూతవైద్యులు లాంటివారు తమ పబ్బం గడుపుతున్నారు.

[embedyt]http://www.youtube.com/watch?v=oBq3-ZqW4Ac[/embedyt]గ్రహాల కదలికకు..మానవజీవిత భవితవ్యానికి పరస్పర సంబంధం ఉందనే నమ్మకంపైనే జ్యోతిష్యశాస్త్రం ఆధారపడి వుంది. సైన్స్‌ అభివృద్ధి చెందుతున్న కొద్దీ జ్యోతిష్యం కేవలం ఒక కట్టుకథ అని తేలిపోయింది. జ్యోతిష్యం నుండి విడిగా ఖగోళ శాస్త్రం అభివృద్ధి చెందింది. దీనినే ''ఎస్ట్రానమీ'' అంటారు. జ్యోతిష్యశాస్త్రం ఒక సైన్స్‌గా అంగీకరించబడలేదు. జ్యోతిష్యం కేవలం ఊహా గానమని, యదార్థం కాదని స్పష్టమైంది. జ్యోతిష్యాన్ని సూడో సైన్స్‌ అని శాస్త్రజ్ఞులు స్పష్టంగా గుర్తించారు. కాని ఈనాటికీ జ్యోతిష్యం యదార్థం అని నమ్మి భ్రమలు-బ్రాంతులకు లోనయ్యే వాళ్ళు లేకపోలేదు. ఎడ్మండ్‌ హేలీ ఖగోళశాస్త్ర పరిశోధనకు పూనుకొనేసరికి శాస్త్రజ్ఞాన రంగంలో మరింత మార్పు వచ్చింది. మతం పట్టు సడలి ఎస్ట్రానమీ బలం పెరిగింది. హేలీ తోకచుక్కలపై పరిశోధన చేసి, ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. ఈ శాస్త్రజ్ఞుడు ఒక కొత్త తోకచుక్కను కనుగొన్నాడు. దానికి హేలీ తోకచుక్క అని పేరుపెట్టారు.

ఎడ్మండ్‌ హేలీ 1656లో అక్టోబరు 19న ఇంగ్లండులో హేగర్‌స్టన్‌లో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. అతను అత్యంత ప్రతిభావంతమైన విద్యార్థి. 1673లో ఆక్స్‌ఫర్డ్‌లో క్వీన్స్‌ కాలేజీలో చేరి 19 సంత్సరాల వయస్సులోనే ఖగోళ శాస్త్ర పరిశోధనలో ముందడుగు వేశాడు. రాయల్‌ ఎస్ట్రానమర్‌గా వున్న ఫ్లమ్‌ స్టీడ్‌ 2,335 నక్షత్రాల గురించి పరిశోధన చేసి, ఆకాశం ఉత్తరార్థంలోని నక్షత్రాల రూపురేఖలను వివరించారు. అందుచేత హేలీ ఆకాశంలో దక్షిణార్థంలో వున్న నక్షత్రాలను పరిశోధించాలనుకున్నాడు. బ్రిటీష్‌రాజు ప్రోత్సాహంతో దక్షిణ ధృవంవైపు వున్న సెంట్‌ హెలినాకు హేలీ వెళ్ళాడు. అమెరికా ఖండం చివర దక్షిణ ధృవం దగ్గరలో వున్న సెయింట్‌ హెలీనాలో 2 సంవత్సరాలు ఉండి అక్కడి నక్షత్రాలను సునిశితంగా పరిశీలించాడు. అందుచేతనే హేలీని ''దక్షిణ ప్రాంత ట్రైకో బ్రాహే''గా కీర్తిస్తారు. 22 సంవత్సరాల వయస్సులోనే హేలీని రాయల్‌ సొసైటీ సభ్యునిగా ఎన్నుకొంది. ఇంగ్లండులో ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడైన న్యూటన్‌కు, యువకుడైన హేలీకి మంచి పరిచయం ఏర్పడింది. హేలీ పట్టుదల వల్లే న్యూటన్‌ తాను కనుగొన్న గొప్ప విషయాలను పుస్తకరూపంలో ప్రచురించాడు. న్యూటన్‌ వ్రాసిన గొప్పగ్రంథం ప్రిన్సిపిియాను హేలీ తన స్వంత ఖర్చుతో ముద్రించాడు. హేలీ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో జామెట్రీ ప్రొఫెసర్‌గా రాయల్‌ ఎస్ట్రానమర్‌గా జీవితాంతం కొనసాగాడు. న్యూటన్‌ తన ప్రిన్సిపియాలో తోకచుక్కల గురించి వివరించాడు. వాటిపై హేలీ తదేకదీక్షతో పరిశోధన చేశాడు. ఎన్నో కొత్త విషయాలు కనుగొన్నాడు. తోకచుక్కలు కనబడటం ప్రకృతిలో అరుదుగా జరిగే సంఘటన. అందుచేత అవి కీడు చేస్తాయని చాలాకాలం ప్రచారం జరిగింది. తోకచుక్కలు కనబడటం భయోత్పాతం కలిగించేవి. ''పాపం పెరిగినప్పుడు దేవుడు పంపే దూతలుగా తోకచుక్కలు పాపులను శిక్షించడానికి వస్తాయి'' అని మతస్తులు చెప్పేవారు. ఈ రకంగా ప్రజలను తన గుప్పెట్లో పెట్టుకోవాలని మతం ప్రయత్నించింది. తోకచుక్క కనబడటానికి మానవజీవితానికి సంబంధంలేదు. తోకచుక్క కనబడటం మానవాతీత శక్తి వల్ల జరగడంలేదు. దానిలో మహాత్మ్యం ఏమీలేదు. తోకచుక్క కనబడటానికి, రాజులు, ఇతర గొప్పవాళ్ళు మరణించడానికి ఏవిధమైన సంబంధం లేదు. అజ్ఞానం భయానికి దారి తీస్తుంది. విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ యదార్థం గుర్తించడం పెరుగుతుంది.

శాస్త్రజ్ఞుడైన హేలీ తన పరిశోధనల ద్వారా ఆ తోకచుక్క 75 లేక 76 సంవత్సరాలకి ఒకసారి కనబడుతుందని నిర్ధారించారు. తాను 1742లో చని పోయినా 1753లో ఆ తోకచుక్క తిరిగి కనబడుతుందని హేలీ తన పరిశోధనల ద్వారా ముందేచెప్పారు. 1753లో ఆ తోకచుక్క కనబడటం తో హేలీని తోకచుక్కల పితామహునిగా కీర్తించారు. ఆ తరువాత హేలీ తోకచుక్క 1835లోనూ, 1910లోనూ, 1985నూ కనబడింది. 1910లో తోకచుక్కని చక్కగా ఫొటో కూడా తీశారు. 1985లో ఖగోళ శాస్త్రజ్ఞులు ఆ తోకచుక్కని ఇంకా వివరంగా పరిశోధించి ప్రజలను చైతన్యవంతులను చేశారు. నాస్తిక భావాలు గల కొందరు శాస్త్రజ్ఞులు మూఢనమ్మకాలను, అపోహలను గట్టిగా ఖండించారు. ప్రముఖ నాస్తికుడు పీరీబాయల్‌ తోకచుక్కలపై 1680లో ఒక పుస్తకాన్ని కూడా వ్రాశాడు. విజ్ఞానం దశదిశలావ్యాప్తి చెందితే మౌఢ్యం పటా పంచలు అవుతుంది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం