తాజా కథలు @ CCK

తేనెల తేటల మాటలు

2015-06-16 19:05:01 చిన్నారి గీతాలు
తేనెల తేటల మాటలతో
మన దేశ మాతనే కొలిచెదమా
భావం, భాగ్యం కూర్చుకుని
నవ జీవన యానం చేయుదమా      //తేనెల//

[embedyt]http://www.youtube.com/watch?v=fJMHv6HuMi0[/embedyt]సాగర మేఖల చుట్టుకొని
సురగంగ చీరగా మలచుకొని
స్వేచ్ఛాగానం పాడుకొని
మన దేవికి ఇవ్వాలి హారతులు      //తేనెల//

గాంగ జటాధర భావనతో
హిమశైల రూపమే నిలబడగా
గల గల పారే నదులన్నీ
ఒక బృంద గానమే చేస్తుంటే          //తేనెల//

ఎందరొ వీరుల త్యాగ ఫలం
మన నేటి స్వేచ్చకే మూల బలం
వారందరినీ తలచుకొని
మన మానస వీధిని నిలుపుకొని    //తేనెల//

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం