తాజా కథలు @ CCK

కోయిల పాడేదెందుకని ?

2015-05-26 23:05:02 చిన్నారి గీతాలు
[embedyt]http://www.youtube.com/watch?v=QROCZwOoQd8[/embedyt]

కోయిల పాడేదెందుకని ?

పాటలు బాగా పాడమని కోడి కూసేదెందుకని ?

వేకువ జామున లేవమని నెమలి ఆడేదెందుకని ?

ఆనందముగా ఉండమని ఉడత గంతులు ఎందుకని ?

చింతలు లేక మెలగమని పావురం చెప్పేదేమిటని ?

శాంతిని ఎపుడూ కోరమని తాబేలు చెప్పేదేమిటని ?

తొందరపాటు తగదని సాలీడు చెప్పేదేమిటని ?

పట్టుదలగ పైకెదగమని కుందేలు చెప్పేదేమిటని ?

ఖుషీ ఖుషీ గా ఉండమని ఒంటెలు చెప్పేదేమిటని ?

ఒంటరితనం వీడమని చేపలు చెప్పేదేమిటని ?

చురుకుగా ఎప్పుడు ఉండమని .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం