తాజా కథలు @ CCK

పెంపుడు కోతి

2015-05-20 13:05:01 చిన్నారుల కథలు
ఒక రోజున దాసూ , వాసూలు తోటలో ఆడుకుంటూ ఉండగా, గొర్రెలు కాచే కుర్రవాడు అక్కడికి వచ్చి "నా పెంపుడు కోతి పారిపోయిందనుకున్నారా? లేదు. అది నా దగ్గరే ఉంది. మాటలు కూడా నేర్చాను. వచ్చి చూడండి" అన్నాడు.

దాసూ, వాసూలు వాడి వెంట వెళ్లి పొదల చాటున ఉన్న కోతిని "నీ పేరేమిటి" అని అడిగారు.

పొదల్లోనుంచి "సోములు" అన్న జవాబు వచ్చింది. ఈ లోపల పెద్దపులి పొదల్లో జొరబడింది.

ఆ వెంటనే "పులి నా కాలు కొరుకుతున్నదిరో  అన్నో" అంటూ అరిచి, గొర్రెలు కాచే కుర్రవాడి తమ్ముడు పొదల్లో నుంచి బయటకి దూకి పరిగెత్తసాగాడు.

దాసూ , వాసూలు నవ్వుకున్నారు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం