తాజా కథలు @ CCK

ముక్కుపుడక

2015-05-10 07:05:02 చిన్నారుల కథలు
రత్తయ్యశెట్టి ఏదో పని మీద నగరానికి వెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తూ, తన భార్యకొక అద్భుతమైన ముక్కుపుడక కొనుక్కు వచ్చాడు. దాని ఖరీదు లక్ష రూపాయలు. ఈ వార్త క్షణాలలో ఊరంతా పాకిపోయింది. ఎక్కడ విన్నా  ముచ్చటే !

చింతకాయల వీధిలో ఓ పది మంది అమ్మలక్కలు పోగయ్యారు. అందరూ కూడబలుక్కుని  శెట్టి గారింటికి బయలుదేరారు.

దారిలో వారికి భైరాగి తాత కనిపించాడు. రచ్చబండ మీద కూర్చుని తత్వం పాడుకుంటున్నాడు. "జట్టుగా కదిలిపోతున్నారు, ఏమిటమ్మా విశేషం?" అని అడిగాడు. "ముక్కుపుడకను చూసొద్దామని ". రత్తయ్య గారింటికేనా?వెళ్లిరండమ్మా! " అంటూ మళ్లీ తత్వం అందుకున్నాడు బైరాగి. మరో అరగంట తరువాత ఆ దారినే తిరిగి వచ్చారు వాళ్లు. గల గలా మట్లాడుకుంటున్నారు వాళ్ళు. ముక్కుపుడకను పొగడటానికి వాళ్లకు మాటలు చాలటం లేదు.

భైరాగి పలకరింపుతో వాళ్లు ఆగిపోయారు. "అంతగా అశ్చర్యపడతన్నారేమిటి తల్లీ?" అనగానే  "ఆశ్చర్యం కాక మరేమిటి తాత! అలాంటి ముక్కుపుడక లోకంలో ఇంకెక్కడా ఉండదా!" అని ఒకరూ, శెట్టి గారి భార్యదే కదా అదృష్టమంటే ! " అని ఒకరూ, "దాన్ని తయారు చేసిన వాడి నైపుణ్యమే నైపుణ్యం ! "అని ఒకరూ గోల గోలగా చెప్పసాగారు. "ఎంతసేపు ముక్కుపుడకను గురించి తప్ప, ముక్కును చేసిన వాణ్ని మరిచిపోయి, ముక్కుపుడకను చేసిన వాణ్ని మెచ్చుకుంటున్నారేమిటమ్మా?"

"ఆ మాటలకు ఎవరూ మారు పలక లేదు. మౌనంగా ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. అద్దాలలో చూసుకుని "అలాంటి ముక్కుపుడుక లేకపోతే మాత్రమేం? ఈ ముక్కే చాలు!" అని మురిసిపోయారు. "ఇంత చక్కగా ముక్కును ఎలా చేశాడో మరి  ఆ బ్రహ్మ! " అని ఆశ్చర్యపోయారు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం