తాజా కథలు @ CCK

క్రమశిక్షణకు తొలి అడుగు , తుది అడుగు సమయపాలన

2015-02-26 11:05:01 చిన్నారుల కథలు
సుప్రసిద్ధ పండితుడు రాధామనోహరుడికి ఆరోజు సాయంకాలం పారుపల్లి జమీందారు అధ్యక్షతలో సన్మానం. ఆయన సభికులకు సందేశాత్మకమైన కవితను వినిపించాలని తీవ్రంగా ఆలోచించాడు. " సూర్యోదయం-అస్తమయం, పగలు-రేయి, పౌర్ణమి-అమావాస్య, ఎండలు-వానలు అన్నీ నిర్ణీత సమయంలోనే  వస్తాయి.

ప్రకృతిలో ప్రతి అణువూ సమయపాలన పాటిస్తుంది. మనుషులను జంతుజాలం నుంచి వేరు చేసేది క్రమశిక్షణ. క్రమశిక్షణకు తొలి అడుగు, తుది అడుగు సమయపాలన. ప్రగతిని కోరే ప్రతి మనిషికీ సమయపాలన శ్వాసకావాలి" అని , అర్థం వచ్చేలా ఒక పద్యం రచించి పదే పదే రాగయుక్తంగా మననం చేయసాగాడు.

ఆరోజు మధ్యాహ్నం జమీందారు ఇంట సుష్టుగా భోజనం చేసి కాస్త ఎక్కువ సేపు నిద్రపోవడంతో సన్మాన సభకు కొద్దిగా ఆలస్యంగా బయలుదేరవలసి వచ్చింది. కొంత దూరం వెళ్ళేసరికి గురబ్బ్రండి వేగం పెరిగింది. ఆ వేగానికి తట్టుకోలేక బండివేగం కాస్త తగ్గించమన్నాడు పండితుడు.

"సభకు ఇప్పటికే ఆలస్యమయింది. ఇంకా చాలా దూరం వెళ్ళాలి,'' అన్నాడు బండి తోలేవాడు. "సభకు పది నిమిషాలు ఆలస్యమవుతుంది కదా  ! అని, పది సంవత్సరాలు ముందుగానే వెళ్ళిపోవడం భావ్యం కాదు కదా !'' అన్నాడు పండితుడు. ఆ మాటకు బండివాడు చిన్నగా నవ్వి, బండి వేగాన్ని తగ్గించాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం