తాజా కథలు @ CCK

కుక్క

2015-06-06 19:05:01 చిన్నారుల కథలు
నాగరాజు అనే ఒక సన్నకారురైతు, తండ్రి, తాతల ద్వారా తనకు సంక్రమించిన నాలుగెకరాల పొలం అమ్మి, దూరంగా ఒక అడవి పక్కన పదెకరాల బీడు భూమి కొన్నాడు. వ్యవసాయ వృత్తిలో బాగా ఆరితేరినవాడు గనక, అతడు ఆ బీడు భూమి ఎలాంటి పంటలకు అనుకూలమో బాగా పరీక్షించి, ఎనిమిది ఎకరాలు వరిసాగుకూ, మిగతాది పళ్ళతోటకూ కేటాయించాడు. ఆ తర్వాత నాగరాజు పదిమంది కూలీలను పెట్టుకుని, వాళ్ళతో పాటు తనూ ఒళ్ళొంచి పనిచేస్తూ, నాలుగైదు సంవత్సరాల్లో, ఆ చుట్టుపక్కల గల భూస్వాముల్లో తనూ ఒకడని పించుకున్నాడు.

ప్పుడు నాగరాజుకు ఒక కొత్త సమస్య ఎదురైంది. ఆనాటి వరకూ, అక్కడున్న బీడు భూమికేసి తలెత్తి చూడని అడవిలోని లేళ్ళూ, అడవి పందులూ, నక్కల్లాంటివి-ఇప్పుడు రాత్రి ఆ పొలం మీదికి వచ్చి పంటలకు నష్టం కలిగించసాగాయి. ఇప్పుడేం చేయడమా అని నాగరాజు ఆలోచిస్తున్నంతలో, సంతలో అతడికి తటస్థపడిన దూర గ్రామం భూస్వామి అతడి సమస్య విని, ‘‘నీది చాలా చిన్న సమస్య.

ఒక వేటకుక్కను కొని రాత్రివేళ పొలంలో వదులు, చాలు. దాని భయంకర రూపానికీ, భీతిగొల్పే అరుపూవిని, అడవిజంతువులు నీ పొలంకేసితలెత్తయినా చూడవు,'' అన్నాడు. ఈ సలహాకు చాలా సంతోషించిన నాగరాజు, ఇంటికి వస్తూనే దుక్కన్న అనే తన పాలికాపును పిలిచి సంగతి చెప్పి, ‘‘ఇదిగో, ఇరవై రూపాయిలిస్తున్నా.

సంతకు వెళ్ళి మంచి వేటకుక్కను కొనుక్కురా!'' అన్నాడు. దుక్కన్న డబ్బు తీసుకుని కాసేపు ఆలోచించి, ‘‘అయ్యూ! ఇరవై రూపాయిలకు వేటకుక్క దొరకదు. మరొక ఇరవై ఇవ్వండి,'' అన్నాడు. నాగరాజు సరేనంటూ మరొక ఇరవై రూపాయలు ఇచ్చాడు. దుక్కన్న డబ్బు తీసుకుని వెళ్ళబోతూ, ‘‘అయ్యూ! వేటకుక్క ఎలా వుంటుంది?'' అని నాగరాజును అడిగాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం