తాజా కథలు @ CCK

చెరి సగం

2015-05-22 23:05:01 చిన్నారుల కథలు
కొండయ్య బండి నుంచి బియ్యం బస్తాలను ఒక్కొక్కటిగా వీపు మీదికెత్తుకుని దుకాణంలోకి చేరుస్తున్నాడు. ఒక బస్తా పట్టు తప్పి కిందపడి బియ్యం చెల్లా చెదరయ్యింది. బియ్యూన్ని మళ్ళీ బస్తాలోకి నింపి, పైకెత్తుకోబోయి, ఎత్తలేక కష్టపడసాగాడు. దానిని గమనించిన దుకాణం యజమాని రంగనాధం, ‘‘ముసలోడివైపోయూవు కొండయ్యూ. ఇక బస్తాలు మోయడం నీవల్ల కాదు. రేపటి నుంచి పనికిరావద్దు.

గంగణ్ణి రమ్మన్నాను,'' అన్నాడు. ‘‘పనిలేక పోతే, భార్యాబిడ్డలను ఎలా పోషించేది? ఇన్నాళ్ళు పనిచేశాను. ఏదైనా చిల్లరమల్లర పనులైనా ఇవ్వండి బాబూ,'' అని ప్రాథేయపడ్డాడు కొండయ్య. ‘‘ఈ వయసులో ఇంకా ఏం పనిచేస్తావు? కృష్ణా రామా అనుకుంటూ ఇంటి దగ్గర కూర్చో,'' అంటూ వెళ్ళిపోయూడు రంగనాధం. లోకమే చీకటైపోయినట్టు, ‘‘ఏం చెయ్యను దేవుడా!'' అనుకుంటూ ఇల్లుచేరిన కొండయ్య భార్య ముత్యాలమ్మకు జరిగింది చెప్పి కళ్ళనీళ్ళపర్యంతమై పోయూడు.

‘‘దీనికే ఎందుకిలా ఏడుస్తావు? అయినా, ఇంకా ఎన్నాళ్ళని ఒళ్ళు హూనం చేసుకుంటావు. శక్తి ఉన్నన్నాళ్ళు నువ్వు మమ్మల్ని కాపాడావు. ఈరోజు నుంచి మనం కలిసి కష్టపడి బతుకుదాం,'' అన్నది భార్య. ‘‘ఎలా ముత్యాలూ?'' అని అడిగాడు కొండయ్య కన్నీళ్ళు తుడుచుకుంటూ. ‘‘నువ్వు తెచ్చిన కూలీ డబ్బుల్లో రోజూ కొంత పొదుపు చేశాను. ఇప్పుడు నూరు వరహాలు చేరాయి.

దాంతో ఒక బడ్డీ కొట్టు పెట్టుకుంటే మన బతుకు బండి సాగిపోతుంది.మరేం భయపడకు,'' అన్నది భార్య భర్తను ఓదారుస్తూ. కొండయ్యకు ఆ మాటలు తను మొక్కే దేవత పలుకుల్లా వినిపించాయి. రోజుగడిస్తే చాలనుకున్న తనలా కాకుండా, ముందు చూపుతో తన భార్య చేసిన పొదుపు తమకిప్పుడు ఉపయోగపడడం అతడికెంతో ఊరట కలిగించింది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం