తాజా కథలు @ CCK

అన్నదమ్ములు

2015-06-05 15:05:01 చిన్నారుల కథలు
ాలాకాలం క్రితం ఒక చిన్న గ్రామంలో ఆదిత్య, అనుదీప్‌ అనే ఇద్దరు అన్నదమ్ములు నివసి స్తూండేవారు. వాళ్ళు ఒకరినొకరు ప్రాణ సమా నంగా ప్రేమించుకునేవారు. తల్లిదండ్రులు పోవ డంతో కడుపునింపుకోవడానికి వాళ్ళే స్వయంగా కష్టపడి పని చేసేవారు. చేపలు పట్టి అమ్మి దానితో పొట్టపోసుకునే వారు. ఒకనాడు వాళ్ళకు ఎక్కువ చేపలు దొరి కాయి. వాటిని అమ్మి అమితానందంతో ఇంటికి చేరారు.

కొంతసేపటికి ఎవరో తలుపు తట్టిన చప్పుడయింది. అనుదీప్‌ వెళ్ళి తలుపు తెరిచి చూశాడు. కుంటి బిచ్చగాడొకడు కనిపించాడు. అనుదీప్‌ వాడి మీద దయతలచి, ఇంటిలోప లికి వెళ్ళి గిన్నెలో కొంత అన్నం, వేయించిన చేపలు తెచ్చి బిచ్చగాడి పళ్ళెంలో వేశాడు. వాటి నెంతో ఆబగా తిన్న బిచ్చగాడు, అనుదీప్‌ కరుణకు కృతజ్ఞతలు చెప్పుకుని, వెళ్ళిపోయూడు. మరునాడు అదే బిచ్చగాడు మళ్ళీ అదే సమయూనికి వచ్చి వాళ్ళ ఇంటి తలుపు తట్టాడు.

అనుదీప్‌ ఇంట్లో లేడుగనక, ఆదిత్య వెళ్ళి తలుపు తెరిచి చూశాడు. బిచ్చగాణ్ణి చూడగానే చీదరింపుగా విసుక్కున్నాడు. కాని ఆ తరవాత ఒక్కక్షణం ఆలోచించి ఇంటి లోపలికి వెళ్ళి చేపలు పట్టే గాలం కరన్రు తీసుకుని బయటకు వచ్చాడు. ఇంటి తలుపు మూసి బిచ్చగాణ్ణి తన వెంట రమ్మని ముందు నడిచాడు.

ఇరువురూ దాపులనున్న చెరువు గట్టును సమీపించ గానే, ఆదిత్య ఆగి, బిచ్చగాడి చేయి పట్టుకుని, ‘‘ఈ గాలం కరన్రు తీసుకో. గాలా నికి ఎరను గుచ్చి, ఇలా నీళ్ళ లోకి విసిరి కొంతసేపు కదలా మెద లక కూర్చో. చేప పడు తుంది. ఇకపై బిచ్చ మెత్తడం మానేసి, స్వశ… క్తితో సంపాయించడం నేర్చుకో,'' అని చెప్పి తిరిగి వచ్చేశాడు.

ఆ తరవాత కొన్ని సంవత్సరాలు గడిచి పోయూయి. ఒకనాడు దాన ధర్మాలకు, కరుణా స్వభా వానికి పేరుగాంచిన ధనిక వర్తకుడొకడు తమ గ్రామా నికి వస్తున్నాడని అందరూ చెప్పుకోసాగారు. అంత పెద్ద ధనికుడు తమ గ్రామాన్ని వెతు క్కుంటూ ఎందుకు వస్తున్నాడా అని అందరూ ఆశ్చర్య పడసాగారు. అనుకున్నట్టుగానే అందమైన ఒక గుర్ర బ్బండిలో ఆ ధనికుడు రానే వచ్చాడు. గ్రామ స్థులందరూ ఆయనకు స్వాగతం చెప్పడానికి ఎదురు వచ్చారు.

వారిలో అనుదీప్‌, ఆదిత్యలు కూడా ఉన్నారు. బండి ఆగగానే, అందులో నుంచి దిగిన ధనికవర్తకుడు తిన్నగా ఆదిత్య వద్దకు వెళ్ళి, ‘‘నన్ను గుర్తుపట్టలేదా, బాబూ?'' అని అడిగాడు. ‘‘తమవంటి ధనికవర్తకుణ్ణి నా జీవితంలో ఏనాడూ చూడలేదు,'' అన్నాడు ఆదిత్య మెల్లగా, తల అడ్డంగా ఊపుతూ. వర్తకుడు మందహాసం చేస్తూ, ‘‘చూశావు నాయనా! ఒకరోజు మీ ఇంటికి భిక్షంకోసం వచ్చిన ఒక బిచ్చగాణ్ణి తీసుకుపోయి చేపలు పట్టేవిద్య నేర్పావు.

గుర్తుందా? ఆ బిచ్చగాణ్ణే నేను. నువ్వు నేర్పిన విద్యే నన్నింత ఉన్నత స్థితికి తీసుకువచ్చింది. ఆ గొప్ప విద్యను నేర్పి నందుకు కృతజ్ఞతగా నేను సమర్పిస్తూన్న ఈ చిరుకానుకను స్వీకరించు,'' అంటూ బంగారం, తళతళా మెరుస్తూన్న మణులూ, మణిక్యాలు నిండిన ఒక సంచీని ఆదిత్యకు అందించాడు. ఆదిత్య ఆనందానికి అవధులు లేక పోయింది. ఏం చెప్పడానికీ తెలియక అలాగే నిలబడ్డాడు.

పక్కనే నిలబడ్డ అనుదీప్‌ ఒక డుగు ముందుకు వచ్చి, ‘‘ఆకలితో అలమటి స్తూన్న నీకు ఆహారం పెట్టాను కదా? నన్ను మరిచి పోయూవా?'' అని అడిగాడు వర్తకుణ్ణి. ‘‘మరిచిపోలేదు బాబూ! ఆకలికి ఆహారం పెట్టి, నా ప్రాణాలు కాపాడిన పుణ్యాత్ముడివి కదా నువ్వు. అయినా, నువ్వు పెట్టిన ఆహారం నన్ను ఒక్కరోజు మాత్రమే కాపాడింది.

అయితే, మీ అన్నయ్య చేసిన సాయం జీవితమంతా నన్ను కాపాడుతున్నది. అయినా, నువ్వు చేసిన సాయూనికి, దీనిని తీసుకో,'' అంటూ అను దీప్‌కు ఒక బంగారు హారాన్ని ఇచ్చాడు వర్తకుడు. ఆ తరవాత ఆ అన్నదమ్ముల పరోపకార బుద్ధికి మరొకసారి కృతజ్ఞతలు చెప్పి, వర్త కుడు అక్కడి నుంచి బయలుదేరాడు

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం