తాజా కథలు @ CCK

తుమ్మల చెరువు

2015-05-23 13:05:01 చిన్నారుల కథలు
కమల అత్తవారింటికి కాపురానికి వచ్చిన వారం రోజుల్లోనే, భర్త భద్రం పరమ బద్ధకస్తుడని గ్రహించింది. పొలం పనులన్నీ అరవైదాటిన మామ మాధవ…్య్వుచూసుకునేవాడు. భద్రం బాగా పొద్దు ఎక్కాక నిద్రలేచి, భోజనం చేసి ఊళ్ళో అక్కడాయిక్కడా తిరిగి చీకటి పడ్డాక భోజనం వేళకు ఇల్లు చేరేవాడు. భద్రం దినచర్య భరించలేక ఒక రోజు కమల, ‘‘మామగారి వ…ుసు అయిపోయింది.

ఇకపై పొలం పనులు నువ్వు చూసుకుని, ఆ…ునకు కాస్త విశ్రాంతి ఇవ్వకూడదూ,'' అన్నది కాస్త మందలింపుగా. ఈ మాటలకు భద్రం ఫెళ్ళుమంటూ నవ్వి, ‘‘నువ్వు వచ్చాక ఆ…ునకు వంటపనీ, ఇంటిపనీ తప్పి, బోలెడు విశ్రాంతి దొరుకుతున్నది!'' అనేశాడు. ఇలా లాభం లేదని కమల, ఆ రోజు చీకటి తోటే పొలానికి బ…ులుదేరిన మాధవ…్యుతో, ‘‘మీ అబ్బాయిని కూడా మీ వెంట తీసుకు వెళ్ళండి.

ఎన్నాళ్ళని మీరు ఒంటరిగా కష్టపడతారు!'' అన్నది. దానికి మాధవ…్యు అదోలా నవ్వి, ‘‘చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాడని అల్లారు ముద్దుగా పెంచాను. వాడి చేత పొలం పనులు చేయించడం, నాకు బాధగా వుంటుంది. నిద్ర లేపకు, వాణ్ణలా సుఖంగా నిద్రపోనియ్యి,'' అంటూ పొలానికి వెళ్ళిపో…ూడు. అయితే, ఆ సా…ుంత్రం పొలంలో త్రాచు పామొకటి కాటువేసింది.

గ్రామవైద్యుడూ, పాముమంత్రగాళ్ళ చికిత్స ఫలించక, మాధవ…్యు ఆ రాత్రి కాలంచేశాడు. ఆ తర్వాత వారం రోజులు జరిగినా భద్రం దినచర్యలో ఎలాంటి మార్పూ రాలేదు. కమల ఒకనాటి మధ్యాహ్నం భద్రానికి అన్నం వడ్డిస్తూ, ‘‘ఇకపై పొలం పనులు నువ్వు చూసుకోకపోతే ఎలా? మామగారూ లేరు ఇప్పటికే నాట్లు వే…ుడం ఆలస్యమైంది,'' అన్నది.

‘‘ఈ పొలం పనుల గొడవలు నా దగ్గర తీసుకురాకు,'' అన్నాడు భద్రం చిరాగ్గా. ‘‘బావుంది! ఇల్లు గడవడం ఎలా? నువ్వు మారాలి, తప్పదు,'' అన్నది కమల. ‘‘నేను మారేది లేదు. ఆ పనులేవో నువ్వే చూసుకో,'' అంటూ భోజనం ముగించి ఊళ్ళోకి వెళ్ళిపో…ూడు భద్రం. కమల తెల్లబోయింది. భర్తలో మార్పు ఎలా తీసుకురావాలో ఆమెకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఏం చే…ూలో తెలి…ుక ఆమె తెగని ఆలోచనల్లో పడి రాత్రి వంట చే…ుడం కూడా మర్చిపోయింది.

చీకటి పడి భద్రం వస్తూనే, ‘‘ఆకలి దంచేస్తోంది! త్వరగా భోజనం వడ్డించు,'' అన్నాడు. కమల కోపంగా, ‘‘నువ్వు పొలం పనులు పట్టించుకోవు! మనమేం జమీందారులం కాదు, కూర్చుని తినాలంటే ఎలా కుదురుతుంది. నేను వంట చే…ులేదు. ఇకపై నువ్వు కష్టపడి పొలం పనులు చేస్తేనే, నేను వంట చేసేది,'' అన్నది. భద్రం రుసరుసలాడుతూ భార్యను కొట్ట బోేువాడిలా చూసి, ఇంట్లోంచి బ…ులుదేరాడు.

చీకట్లో ఎటు పోతున్నదీ చూసుకోకుండా, అడవినానుకునివున్న తుమ్మల చెరువు దగ్గరకు వచ్చేశాడు. చెరువు గట్టు మీద చాలా తుమ్మచెట్లు గుంపుగా వుండడంతో, ఆ చెరువుకు తుమ్మల చెరువు అన్న పేరు వచ్చింది. గట్టు మీద అక్కడక్కడా ఊడలు దిగిన మర్రి చెట్లు కూడా కొన్ని వున్నవి. ‘‘గ్రామంలో పొలం పుట్రావున్న రైతుల్లో ఒకణ్ణి! అలాంటి నేను ఆకలితో నకనకలాడుతూ రాత్రి వేళ చెట్టూ పుట్టకు తిరగడమా, ఛీ!''

అంటూ ఎవర్నో తన్నబోతున్నట్టు కాలు ఝాడించబోయి, అంతలో రెండో కాలు పట్టు తప్పడంతో చెరువులో పడిపో…ూడు. ఈత రాని భద్రం చెరువునీట రెండు మునకలు వేసి, మూడోమునక వే…ుబోతూ, ‘‘ఇదే జీవితంలో తుదిక్షణం!'' అనుకున్నాడు. ఐతే, ఆ మరుక్షణం అతడి చేతికి ఒక మర్రి ఊడ అందింది. దాని సా…ుంతో భద్రం గట్టు మీదికి చేరాడు. అంతలో ఒక ఆడ పిశాచం అతణ్ణి, ‘‘ఎందుకు చావాలనుకున్నావు?

నేను ఊడ అందించక పోతే, ఈపాటికి చచ్చివుండేవాడివి!'' అన్నది కోప్పడుతున్నట్టు. మొదట్లో పిశాచాన్ని చూసి భ…ుపడిన భద్రానికి, దాని మాటలు వినగానే కాస్త ధైర్యం వచ్చింది. అతడు దానికి ఏం జవాబు చెప్పాలా అని ఆలోచించేంతలో పిశాచం, ‘‘ఏవైనా మంచిపనులు చేసి పైలోకాలకు పోవాలని ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నాను.

నీవల్ల అంతరా…ుం కలిగింది,'' అన్నది. పిశాచి అలా అనగానే భద్రానికి, ఇదేదో సత్తెకాలపు పిశాచి అని అర్థమై పోయింది. అతడు విచారంగా ముఖం పెట్టి, ‘‘నన్ను కాపాడి చాలా పుణ్యం మూటగట్టుకున్నావు. చిల్లిగవ్వ లేనివాడిని, పెళ్ళాన్ని ఎలా పోషించను?'' అంటూ మళ్ళీ చెరువులోకి దూక బోయినట్లు నటించాడు. వెంటనే పిశాచం, ‘‘అంతపని చే…ుకు, ఆగు!''

అంటూ చెట్టు మీదికి ఎగిరి ఒక మూట తీసుకువచ్చి భద్రం చేతిలో పెట్టింది. ‘‘ఈ డబ్బుతో సుఖంగా బతుకుతాను. నీ కోసం ఇంట్లో అందరం ప్రార్థన చేస్తాం,'' అని ఆనందంగా ఇంటిదారిపట్టాడు భద్రం. భద్రం ఇల్లు చేరుతూనే డబ్బు మూట కమల ముందు పడేస్తూ, ‘‘తలుచుకుంటే క్షణంలో డబ్బు గడించగలను. ఇది దొంగ సొమ్మేంకాదు, ఆహా!'' అన్నాడు. కమలకు కలిగిన ఆనందం అంతాయింతా కాదు.

అయితే, భద్రం ఆమర్నాడు తను తెచ్చిన డబ్బులో కొంత జూదానికీ, మరి కొంత తనలాగే పనీపాటూ లేకుండా గాలికి తిరిగే మిత్రులకూ ఖర్చు చేసి ఇంటికి తిరిగొచ్చాడు. ‘‘డబ్బు ఇలా ఎడాపెడా ఖర్చు చేస్తే ఎలా? వ్యవసా…ుం నచ్చకపోతే, ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించు,'' అన్నది కమల. ‘‘ఎవరైనా సలహాలు చెబితే, నాకు కోపం ముంచుకువస్తుంది, తెలుసా?'' అంటూ భార్య మీద విరుచుకుపడ్డాడు భద్రం.

ఈ విధంగా, తుమ్మల చెరువు పిశాచం ఇచ్చిన డబ్బు నెల తిరక్కుండా నే ఖర్చయి పోయింది. భద్రం మళ్ళీ ఆ రాత్రి చెరువులో దూకబోతున్నట్లు నటించి, పిశాచం ఇచ్చిన డబ్బుతో తిరిగొచ్చాడు. భర్త డబ్బుతో రావడం చూసి కమల నిర్ఘాంతపోయింది. వ్యసనాలు మరింతగా పెరగడంతో భద్రం, ఈసారి ఇరవై రోజుల్లోనే డబ్బంతా ఖర్చు చేసేశాడు.

భర్తను కోప్పడి లాభంలేదని గ్రహించిన కమల, ‘‘ఇంట్లో చిల్లి గవ్వ లేదు, ఏం చేసేట్టు?'' అన్నది శాంతంగా. ‘‘ఏం చేసేట్టా? అలా చూస్తూండు మరి,'' అన్నాడు భద్రం భుజాలు ఎగరవేస్తూ. ఆ రాత్రి మళ్ళీ తుమ్మల చెరువుకు బ…ుల్దేరాడు భద్రం. కమల రహస్యంగా అతణ్ణి వెంబడించి, ఒక చెట్టు చాటున నిలబడి, అతడు పిశాచం నుంచి ఎలా డబ్బు సంపాదిస్తున్నాడో కళ్ళారా చూసింది.

భద్రం అలా చెరువు గట్టు దిగగానే, కమల తనూ చెరువులోకి దూకబోతున్నట్లు నటించింది. పిశాచం వెంటనే, ‘‘ఆగాగు! నీ కొచ్చిన కష్టమేమిటి?'' అంటూ కమలను అడ్డుకున్నది. ‘‘నీవల్ల, ఏ ఆడదానికీ రాగూడని కష్టం వచ్చింది!'' అన్నది కమల కోపం నటిస్తూ. ‘‘కష్టమా? నావల్లనా? నేనేంచేశాను?'' అంటూ ఆశ్చర్యపోయింది పిశాచం. ‘‘నీవల్ల నా భర్త మరింత బద్ధకస్తుడుగా మారాడు.

ఉన్నవాటికి తోడు మరికొన్ని కొత్త వ్యసనాలకు అలవాటుపడ్డాడు. ెూగ్యత లేనివారికి సా…ుపడడానికి మించిన పాపం మరొకటి లేదు. ఆ సంగతి నీకు తెలి…ుదా?'' అన్నది కమల తీవ్రస్వరంతో. ‘‘మంచి పని చేస్తున్నాననుకుని, మరింత పాపం మూటగట్టుకున్నానన్న మాట! నా పాపానికి పరిహారమేమిటో నువ్వే చెప్పు,'' అన్నది పిశాచం. అప్పుడు కమల, తన భర్త చెరువులో మునిగి చావబోతున్నట్టు చేసేదంతా నటన అని పిశాచానికి చెప్పి, ఈసారి అతడు వస్తే ఏంచే…ూలో వివరించింది.

పదిహేను రోజుల్లో పిశాచం ఇచ్చిన డబ్బంతా ఎడాపెడా ఖర్చు చేసిన భద్రం, ఆ రాత్రి మళ్ళీ తుమ్మల చెరువులోకి దూకబోతున్నట్టు నటించాడు. అది చూసి పిశాచం కీచుమంటూ నవ్వి, ‘‘చేసిన పాపాల నుంచి విముక్తి పొందేందుకు, ఎలాంటి వారికి సా…ుపడాలో, ఈ మధ్యనే తెలిసివచ్చింది. సోమరిగా తిరుగుతూ పెళ్ళాం కష్టం మీద బతకాలనుకునే నువ్వు మహా పాపివి!

నీట మునిగి చచ్చే నీకు, ఇకపై ఈ చెటే్టగతి,'' అంటూ దూరంగా చీకట్లోకి ఎగిరి పోయింది. పిశాచం మాటలకు భద్రం ఒళ్ళు జలదరించింది. తను చచ్చి పిశాచం అవుతాననే భ…ుం భరించలేక పో…ూడు. తల వంచుకుని ఇంటికేసి బ…ులుదేరాడు. ఆ మర్నాడు చీకటి తోటే భద్రం పొలం పనులకు బ…ుల్దేరడం చూసి, మనసులోనే తుమ్మలచెరువు పిశాచానికి కృతజ్ఞతలు చెప్పుకున్నది, కమల.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం