తాజా కథలు @ CCK

యువకుడు

2015-06-12 05:05:01 చిన్నారుల కథలు
విజయేంద్రుడనే రాజు, సింధునదీ ప్రాంతంలోని మహేంద్రపురి అనే రాజ్యాన్ని పాలిస్తూండేవాడు. ఆ సమయంలో, ఉత్తర ప్రాంతానవున్న పర్వతారణ్యాల నుంచి హూణులనే అనాగరిక జాతులు, మహేంద్రపురి రాజ్యం మీద దాడులు చేస్తుండేవి. విజేుంద్రుడు తన రాజ్యంలోని …ుువకుల్లో, ధైర్యసాహసాలేకాక, రాజ్య రక్షణకు ప్రాణత్యాగమైనా చే…ుడానికి సిద్ధపడినవాళ్ళను, ముందుగా ప్రధానమంత్రి చేత పరీక్షంపజేసి సైన్యంలో చేర్చుకుంటూండేవాడు.

ఒకనాడు ఇరవై ఏళ్ళ …ుువకుడొకడు, రాజదర్శనానికంటూ వచ్చాడు. కాపలాభటులు అతడి వింతవాలకం చూసి నవ్వుకుంటూ, ‘‘మహారాజుతో ఏంపని?'' అని అడిగారు. కాపలావాళ్ళు ఎందుకు నవ్వుకుంటున్నారో గ్రహించిన …ుువకుడు కోపంగా, ‘‘నా ఎడమవైపు మీసంకన్న కుడివైపు మీసం పొట్టిగా వుండడం చూసేగదా మీరు నవ్వుకుంటున్నది.

దాని వెనక మహాసాహసవంతమైన కథ ఒకటున్నది!'' అన్నాడు. ఆ జవాబుకు, కాపలావాళ్ళు మరింత పెద్దగా నవ్వి, ‘‘ఏమిటా కథ?'' అని అడిగారు. …ుువకుడు నడుంనుంచి వేలాడుతున్న కత్తి పిడిపై చేయివేసి, ‘‘ ఆ కథ ప్రతి అడ్డమైన కాపలాశునకానికీ వినిపించేదికాదు. అది వినడానికి మహారాజుగారూ లేక మంత్రిగారూ మాత్రమే అర్హులు!

ముందు నాకు దారి ఇస్తారా లేదా?'' అంటూ కత్తిదూశాడు. ఇది చూసి నివ్వెర పోయిన కాపలా భటులు, వాళ్ళల్లో ఒకణ్ణి సంగతి చెప్పేందుకు మంత్రి దగ్గరకు పంపారు. మంత్రి వాడు చెప్పింది విని ఆశ్చర్యపోతూ, ఆ …ుువకుణ్ణి పంపమన్నాడు. మంత్రి సభాభవన ద్వారం ముందు ఆ …ుువకుడికి ఎదురుపడ్డాడు. …ుువకుడు, ఆ…ునకేసి నిర్భ…ుంగా చూస్తూ, ‘‘తమరు మంత్రిగారేనా, అవునా?'' అన్నాడు. ‘‘అవును, మహామంత్రినే! ఇంతకూ నీ పేరేమిటి? వచ్చిన పనేమిటి?'' అని అడిగాడు.

ఆ వెంటనే …ుువకుడు, ఆ…ునకు తలవంచి నమస్కరించి, ‘‘మహామంత్రివర్యా! నా పేరు నృసింహవర్మ. మహారాజుగారు, మన రాజ్యం మీద దాడి చేసే హూణుల ఆగడాలు కట్టించేందుకు సైన్యంలో ధైర్యసాహసాలుగల …ుువకులను చేర్చుకుంటున్నారని తెలి…ువచ్చింది. అందుకోసం వచ్చాను,'' అన్నాడు. ‘‘అంటే, సైనికెూధుడుగా హూణులతో …ుుద్ధం చే…ుదలచావన్న మాట, బావుంది! ఐతే, నీ మీసం వాలకం చూస్తే, ఎంతటి శత్రువూ కత్తిదూ…ుడానికి జంకుతాడు,'' అంటూ మంత్రి చిరునవ్వు నవ్వాడు.

‘‘మహామంత్రివర్యా! మీసం అలావుండానికి కారణం ఏమిటో పెద్దకథవుంది!'' అన్నాడు నృసింహవర్మ. ‘‘అలాగా! ఆ కథేమిటో సంగ్రహంగా చెప్పు,'' అన్నాడు మంత్రి. నృసింహవర్మ ఒక సారి గొంతు సవరించుకుని, ‘‘నాలోవున్న దేశభక్తికారణంగా, అన్నిటికీ తెగించి, హూణుల నా…ుకుడుండే శిబిరానికి వెళ్ళాను. వాడు పులి చర్మంతో త…ూరైన ఆసనం మీద భల్లూక చర్మం కప్పుకుని కూర్చునివున్నాడు.

చుట్టూరా బాణాలు, కత్తులూ చేతబట్టిన భటులు నన్ను చూసి ఎవరివని ప్రశ్నించే ముందే, నేనా హూణుల నా…ుకుణ్ణి-ఒరే, నిన్ను చూసినవాళ్ళకెవరికైనా, నువ్వు శునకానివా లేక నక్కవా అన్న అనుమానం కలుగుతుంది. మారాజ్యం మీద మిడతల దండులా వాలి దోచుకు తింటున్నావు. నిన్ను... అని నేను మాట ముగించేలోపలే, వాడు తన భటులను, ‘ఒరే, వీడి పీక నరకండి!' అని ఆజ్ఞాపించాడు.

ఆ వెంటనే ఒక భటుడు కత్తిని, నా కంఠం కేసి విసిరాడు. అది గురితప్పి నా కుడి మీసాన్ని సగం ఖండించి, ఖంగు మంటూ కింద పడిపోయింది. ఆ మరుక్షణం నేను వేగంతో దూకి, వాళ్ళకు చిక్కకుండా పారిపో…ూను,'' అన్నాడు. ‘‘ఆహా, ఇదంతా ఎప్పుడు జరిగింది?'' అన్నాడు మంత్రి. ‘‘ఎప్పుడోనా, ఒక పావుగంట ముందు,'' అన్నాడు నృసింహవర్మ తొణక్కుండా. మంత్రి పొట్ట చెక్కలే్యులా నవ్వి, ‘‘ప్రస్తుతం రాజుగారికి కావలసింది, ఆస్థాన విదూషకుడు! నా వెంట రా, రాజదర్శనం చేయిస్తాను,'' అంటూ నృసింహవర్మను వెంటబెట్టుకుపో…ూడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం