తాజా కథలు @ CCK

ప్రకృతి

2015-06-16 13:05:01 చిన్నారుల కథలు
అంకాశ అనే నిరుపేద కురవ్రాడు ఆకలి తీర్చుకోవడానికి ఏదైనా పండు దొరుకుతుందేమో అన్న ఆశతో దాపులనున్న అడవికి వెళ్ళాడు. అడవంతా తిరిగాక, విడిగా ఉన్న ఒక చెట్టు చిటారు కొమ్మలో ఒకే ఒక పండును చూశాడు. చెట్టు మరీ సన్నగా పొడవుగా ఉండడం వల్ల, దాని పైకి ఎక్కడం సాధ్యపడదు. పండును అందుకోవాలంటే చెట్టును వంచాలి; లేదా రాయిని విసరాలి.

ఏం చే…ుడమా అని ఆలోచిస్తూన్న అంకాశకు, ‘‘చెట్టు బోదె సమీపంలో కొద్దిగా తవ్వితే కావలసినది దొరుకుతుంది,'' అన్న కంఠస్వరం వినిపించింది. అంకాశ వెంటనే అక్కడ తవ్వి చూశాడు. బంగారపు ముద్ద కనిపించింది. దానిని వెలు పలికి తీసిన అంకాశకు అక్కడ బంగారం ఇంకా ఉన్నట్టు అనిపించింది. బంగారాన్నంతా ఒకేసారి తీసుకోకుండా, అవసరమైనప్పుడు వచ్చి కొద్ది కొద్దిగా తీసుకోవచ్చన్న ఆలోచనతో, తీసిన గోతిని అలాగే పూడ్చేశాడు.

ఆ బంగారం ముద్దతో పక్కనున్న పట్టణానికి వెళ్ళి, దాన్ని నాణాలుగా మార్చుకుని, ఆ ధనంతో ఒక ఎడ్ల బండినీ, ఇంటికి కావలసిన వస్తువులనూ తీసుకుని బండిలో వేసుకుని తన గుడిసెకు చేరుకున్నాడు. మరుసటి రోజే తన కోసం భవనంలాంటి పెద్ద ఇల్లును కట్టడం ప్రారంభించాడు. కావలసినప్పుడల్లా అడవిలోని చెట్టు వద్దకు వెళ్ళి బంగారం తెచ్చుకుంటూ క్రమక్రమంగా సంపదలు పెంచుకోసాగాడు.

ఇంటినిండా సేవకులు, సిరిసంపదలతో తులతూగుతూన్న అంకాశను ఆశ్రయించి పలువురు వచ్చి, ఆ…ున భవనం చుట్టూ నివాసాలు ఏర్పరచుకున్నారు. అంకాశకు పెళ్ళయింది. చురుకైన కొడుకూ, అందమైన కూతురూ పుట్టారు. వారికి కార్మా, పుష్పనీల అని పేర్లు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతూ, సుఖసంతోషాలతో జీవించసాగాడు.

అంకాశకు సమకూరిన సిరిసంపదలను చూసి ఆ ప్రాంతాన్ని పాలించే రాజుకు అసూ…ు కలిగింది. అంకాశ సిరిసంపదలను ఎలాగైనా కబళించాలని ఆలోచించాడు. ఇలాగే అతన్ని వదిలితే మునుముందు రాజుగా ప్రకటించుకునే అపా…ుం కూడా కలగవచ్చని శంకించాడు. అలాంటి విప త్కర పరిస్థితి కలగకుండా ఉండాలంటే, అంకాశకు వారసులు లేకుండా చే…ుడం ఒక్కటే మార్గ మని తోచింది.

అందుకు ఒక పథకం వేశాడు. కుటిల స్వభావులైన తన ఆస్థానోద్యోగులు ఇద్దరిని అంకాశ వద్దకు పంపాడు. వాళ్ళిద్దరూ గూఢచారుల సా…ుంతో, అంకాశకు చాలా ఇష్టమైన గుర్రాన్ని రహస్యంగా దొంగిలించి తీసుకుపోయి అరణ్య మధ్యంలోని ఒక చెట్టుకు బంధించి వచ్చారు. అంకాశ గుర్రం కోసం ఆందోళనతో వెతుకుతున్నప్పుడు ఆ…ున వద్దకు వెళ్ళి తమను జ్యోతిష్కులుగా పరిచ…ుం చేసుకుని, గుర్రం ఎక్కడున్నదో చెప్పారు.

సేవకులు వెళ్ళి గుర్రాన్ని తీసుకువచ్చారు. పరమానందం చెందిన అంకాశ, తమ పిల్లల భవిష్యత్తును కూడా చెప్పమని కోరాడు. దొంగ జ్యోతిష్కులు కొంతసేపు ఏవేవో లెక్కలు గట్టారు; తమలో తాము చర్చించుకున్నట్టు నటించారు. ఆఖరికి, ‘‘ మీ పిల్లలు ఇక్కడే గనక వుంటే మీ భార్యాభర్తలకూ, మీ బంధు మిత్రులకూ ప్రాణాపా…ుం తప్పదు.

వెంటనే వారిని ఏ అరణ్యం మధ్యనో వదలిరావడం ఒక్కటే మీ ప్రాణాలు కాపాడుకోవడానికి తరుణోపా…ుం,'' అని అంకాశకు రహస్యంగా చెప్పారు. ఆ మాటవిని అంకాశ దిగ్భ్రాంతి చెందాడు. వేదనతో వారి సలహాను పాటించడానికే నిర్ణయించాడు. తన కొడుక్కీ, కూతురికీ మత్తుమందునిచ్చి, అర్ధరాత్రి సమ…ుంలో ఒక గురప్రు బండిలో ఎక్కించి అరణ్యంలోకి పంపాడు.

తెల్లవారుతూండగా, బండి తూరుపు సముద్ర తీరం చేరింది. నిద్రిస్తూన్న పిల్లలను ఒక బండ మీద పడుకోబెట్టి సేవకులు తిరిగి వచ్చేశారు. సూర్య కిరణాలు సోకగానే కార్మా, పుష్పనీల నిద్రలేచారు. ఎక్కడో ఉన్నాం ఏమిటా అని భ…ుపడడానికి బదులు, వాళ్ళు మనోహరమైన సూర్యోద…ూన్నీ, సూర్యరశ్మి సోకడంతో బంగారు కాంతు లీనుతూన్న సాగర తరంగాలనూ చూసి మురిసి పో…ూరు.

‘‘ ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆనందించమని మన అమ్మానాన్నలు మనల్ని ఇక్కడ వదిలినట్టున్నది,'' అన్నాడు కార్మా. ‘‘అవును, అవిగో చూడు ఆ పువ్వు లెంత అందంగా ఉనాెూ్న,'' అన్నది పుష్పనీల. ‘‘ఇదిగో ఇటుచూడు. ఆ చెటె్టంత మనోహరంగా ఉందో!'' అన్నాడు కార్మా, చెట్టంతా పువ్వులతో నిండిన అద్భుతదృశ్యాన్ని చూపుతూ. అలా చాలాసేపు వాళ్ళు ఆ చుట్టు పక్కల తిరిగారు. తి…్యుటి ఫలాలను కోసి తిన్నారు.

సెలేుటి నీళ్ళు తాగారు. సూర్యాస్తమ…ుమయింది. హఠాత్తుగా వాళ్ళ ఎదుట వెన్నెల వెలుగులో ఒక సుందర భవనం కనిపించింది. ఆశ్చర్యంగా వాళ్ళు దానిని సమీపించారు. ‘‘లోపలికి రండి,'' అంటూ ఒక సుమధుర కంఠస్వరం వినిపించింది. లోపలికి వెళ్ళగానే రకరకాల వంటలు, పడక కనిపించాయి. ‘‘మాకు ప్రేమతో ఆతిథ్యమిస్తున్న మీరు ఎవరు?'' అని అడిగారు అన్నాచెల్లెళ్ళు. ‘‘నేను ప్రకృతి దేవతను. మీరు నా చెట్లను, పూలను, కడలి అలలను, ప్రేమించారు.

అది నాకెంతో ఆనందం కలిగించింది. ఇప్పుడేం వరం కావాలో కోరుకోండి. బంగారం కావాలా? ప్రకృతి రహస్య ప్రేమ కావాలా?'' అన్నదా కంఠస్వరం. ‘‘ప్రకృతి రహస్య ప్రేమ!'' అన్నారు అన్నా చెల్లెళ్ళు ముక్తకంఠంతో. ‘‘అద్భుతం! ప్రకృతి మీతో ఎప్పుడూ స్నేహంగా ఉంటుంది!'' అన్నది కంఠస్వరం. ‘‘కృతజ్ఞతలు!'' అని చెప్పిన అన్నాచెల్లెళ్ళు, కడుపునిండా తిని, పడక మీద పడుకుని హాయిగా నిద్రపో…ూరు. తెల్లవారాక వాళ్ళు కళ్ళు తెరిస్తే భవనం లేదు. చుట్టూ బందిపోటు దొంగలు నిలబడి ఉన్నారు.

‘‘నడవండి, మీరు మాకు బానిసలు!'' అన్నాడు దొంగల నా…ుకుడు. ‘‘మేము రాము,'' అన్నారు అన్నా చెల్లెళ్ళు. ‘‘రారా? అహ హా!'' అంటూ దొంగల నా…ుకుడు కత్తి ఝళిపించాడు. మరుక్షƒణమే దొంగ వెలవెల పో…ూడు. దిక్కులు పిక్కటిల్లేలా గర్జిస్తూ దొంగ మీదికి ఉరికిన సింహం వాణ్ణి నోట కరుచుకుని ఎటో వెళ్ళిపోయింది. మిగిలిన దొంగలు దిక్కుకొకరు పారిపో…ూరు. ప్రకృతి రహస్య ప్రేమ తమను కాపాడిందని గ్రహించిన అన్నా చెల్లెళ్ళు సముద్ర తీరంలో నడవసాగారు.

కొంత దూరం వెళ్ళగా లంగరు దింపిన ఒక ఓడ కనిపించింది. కొందరు నావికులు వారికేసి వచ్చారు. ‘‘మేము మా తల్లి దండ్రుల దగ్గరికి వెళ్ళాలి. సా…ుపడగలరా?'' అని అడిగిన అన్న కార్మా, తమ ఊరి గురించి వివరించాడు. ‘‘అలాగే, ఓడలోకి రండి. మిమ్మల్ని మీ ఊళ్లో దిగబెడతాను,'' అన్నాడు ఓడ…ుజమాని. అన్నా చెల్లెళ్ళు సంతోషంగా ఓడలోకి ఎక్కారు.

లంగరెత్తడంతో ఓడ ముందుకు కదిలింది. కొంత దూరం వెళ్ళాక ఓడ …ుజమాని బిగ్గరగా నవ్వుతూ, ‘‘నేను నీ చెల్లెల్ని పెళ్ళాడతాను. నువ్వు నాకు సేవకుడిగా ఉండిపో,'' అన్నాడు కార్మాతో. ‘‘నిన్ను పెళ్ళాడ్డమా, ఓరి దుర్మార్గుడా?'' అన్నది పుష్పనీల కోపంగా. ఓడ …ుజమాని పట్టరాని ఆగ్రహంతో ఆమెను అమాంతం ఎత్తి సముద్రం అలల మీదికి విసిరికొట్టాడు. ‘‘అెూ్య, చెల్లెలా!'' అంటూ అరిచాడు కార్మా.

అతని కళ్ళెదుటే ఆమె ఒక పెద్ద తిమింగిలం నోట్లో పడింది! ‘‘నువ్వు చచ్చేదాకా నా సేవకుడిగానే పడివుండు,'' అన్నాడు నావికుడు కార్మాతో. అయితే, ఆ క్షణమే తుపాను చెలరేగింది. అల్లకల్లోలమైన కడలి తరంగాలపై అటూ ఇటూ ఊగిసలాడిన ఓడ, తుత్తుని…ులై సముద్రంలో మునిగిపోయింది. కార్మా ఒక ఓడ చెక్కను గట్టిగా పట్టుకుని సముద్రంపై తేలసాగాడు.

ఆ చెక్కను రెండు డాల్ఫిన్‌ చేపలు తోసుకుంటూ రావడం గమనించాడు. కొంతసేపటికి అలాగే స్పృహ కోల్పో…ూడు. అతడు స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచేసరికి, ఒక గుడిసెలో పడుకుని వున్నాడు. పక్కనే నిలబడ్డ ఒక వృద్ధురాలు, ‘‘మూడు రోజుల క్రితం సముద్ర తీరంలో పడివుండడం చూశాను.

దేవు డిచ్చిన బిడ్డగా భావించి ఇంటికి తీసుకువచ్చాను,'' అన్నది ఆనందంగా. కార్మా ఆమె కేసి కృతజ్ఞతగా చూశాడు. మరుక్షణమే తన చెల్లెలు గుర్తురావడంతో అతడి హృద…ుం విలవిలలాడింది. అయినా, అతడు లేచి కూర్చుని, మెల్లగా కోలుకుని, అక్కడే ఉంటూ గుడిసె చుట్టూ ఉన్న బీడునేలలో మొక్కలను నాటి పెంచసాగాడు.

సంవత్సరం తిరిగే సరికి అక్కడొక పూలతోట, పళ్ళతోపు త…ూర…్యూయి. ‘‘నా…ునా, ఇటీవలే పట్టాభిషిక్తుడైన …ుువరాజుకు వివాహ మహోత్సవం జరగనున్నది. కనులవిందుగా జరిగే పెళ్ళి ఊరేగింపును చూసి వద్దాం రా,'' అని వృద్ధురాలు కార్మాను వెంట బెట్టుకుని రాజధానికి చేరుకున్నది. రాజధానీ నగరం వేడుకలతో కోలాహలంగా వుంది.

ఎటు చూసినా జనం. ఇరుగు పొరుగు రాజ్యాల వారందరూ ప్రత్యేక వేదిక మీద నిలబడి వేడుకలను తిలకించాలని ప్రకటించారు. అందువల్ల కార్మా కూడా ఆ ప్రత్యేక వేదిక మీదికి చేరాడు. రథంలో వధూవరుల ఊరేగింపు బ…ులుదేరింది. ఆ రథం కార్మా ఉన్న వేదికను సమీపించగానే ఆగిపోయింది. ‘‘అన్న…్యూ, ఇక్కడే ఉన్నావా!'' అంటూ పిలిచింది అందాల వధువు. భటులు వెళ్ళి, కార్మాను తెచ్చి వధువు ముందు నిలబెట్టారు.

తిమింగిలం మింగేసిన తన చెల్లెలే ఇప్పుడు …ుువరాజును వివాహమాడనున్న వధువు అని గ్రహించడానికి కార్మాకు కొంతసేపు పట్టింది. ఆనందాతిరేకంతో ఉబ్బితబ్బిబ్బ…్యూడు! నిజానికి ఆరోజు పుష్పనీల తిమింగిలం నోట్లో పడిందే తప్ప, అది మింగలేదు. తిమింగిలం ఆమెను బలంగా ఉమ్మడంతో ఆమె తీరంలోకి వచ్చిపడింది. ఉద…ుం వాహ్యాళికి వెళ్ళిన …ుువరాజు ఆమెను చూసి భవనానికి తీసుకువచ్చాడు.

క్రమంగా ఆమె కోలుకున్నది. తన అన్న కోసం వెతికింది కాని, ఫలితం లేకపోయింది. ఇంతలో …ుువరాజు ఆమెను ప్రేమించి, పెళ్ళాడమన్నాడు. అదే సమ…ుంలో అన్న…్యును వెతికించే పనిని కూడా కొనసాగిస్తానని మాట ఇచ్చాడు. రాజు - పుష్పనీలల వివాహం ఘనంగా జరిగింది. కార్మా, రాజుకు నూతన సలహాదారు అ…్యూడు. కొన్నాళ్ళు గడిచాక, కార్మా తన తల్లి దండ్రులను వెతుక్కుంటూ వెళ్ళాడు.

దుర్మార్గుడైన రాజు కారణంగా వాళ్ళు బికారులైపోవడం చూసి, బాధపడి వారిని తన వెంటబెట్టుకుని వచ్చాడు. ఆ తరవాత సేనలతో వెళ్ళి ఆ రాజును ఓడించి, సింహాసనాన్ని ఆక్రమించాడు. అన్నాచెల్లెళ్ళు కలుసుకున్నప్పుడల్లా, ‘‘మన జీవితంలో ముఖ్యమైన ప్రతి మలుపులోనూ ప్రకృతి రహస్య ప్రేమ మనల్ని కాపాడింది కదూ!'' అని ఆనందంగా చెప్పుకునేవారు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం