తాజా కథలు @ CCK

చిట్టచివరకు అదృష్టం

2015-04-18 19:05:02 చిన్నారుల కథలు
వీరభద్రుడనే రాజు పరమ దయూస్వభావుడు. ప్రజలకు ఎలాంటి కొరతా లేకుండా పరిపాలించడంతో పాటు, అవసరంలో ఉన్నవారిని ఆదుకునేవాడు. ఎవరైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా, తీర్థయూత్రలకు వెళ్ళి రావాలన్నా, దీర్ఘ వ్యాధులతో బాధ పడుతూ వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సాయం అర్థించినా లేదనకుండా ఇచ్చేవాడు.

రాజు నుంచి సాయం పొందిన వారికి అంతటితో కష్టాలు తీరిపోయేవి. అదృష్టం కలిసివచ్చేది. రాజుగారిచ్చిన డబ్బుతో ప్రారంభించిన వ్యాపారం అభివృద్ధి చెందిందనీ, మొక్కు తీర్చుకున్నామనీ, దీర్ఘవ్యాధినయమై ఆరోగ్యవంతు లమయ్యూమనీ సాయం పొందినవారు వచ్చి చెబుతూ ఉంటే, రాజు వారిమాటలు విని ఎంతో ఆనందించేవాడు.

అయితే, ఒక్క విషయంలో మాత్రం రాజును తీరని విచారం పీడించసాగింది. రాజుగారికి వీరమూర్తి అనే దూరపు బంధువు ఉండేవాడు. అతడు కడు బీదవాడు. అతనికి సాయపడాలని రాజు ఎన్నిసార్లు ప్రయత్నించినా కృతకృత్యుడు కాలేకపోయూడు. వీరమూర్తి మంచి వేటగాడు. వివిధ విషయూల మీద పద్యాలు అల్లి సాహితీప్రియుడైన రాజుగారికి వినిపించేవాడు. అతడు అలా వినిపించినప్పుడల్లా, రాజు అతన్ని విలువైన కానుకలతో, ధనంతో సత్కరించేవాడు. అయితే, వాటిని సద్వినియోగం చేసుకునే లోపలే, దొంగలు దోచుకునేవారు; లేదా తనే పోగొట్టుకునేవాడు. అందువల్ల అతడు పేదరికం నుంచి బయటపడలేకపోయూడు.

ఒకనాడు వీరమూర్తి అడవికి వెళ్ళి, ఎన్నో జంతువులను వేటాడి వచ్చాడు. అతడు తెచ్చిన వాటిని చూసి రాజు పరమానందం చెందాడు. సభాసదుల సమక్షంలో అతన్ని ఘనంగా సత్కరించాలనుకున్నాడు. అందువల్ల వెంటనే సభను ఏర్పాటు చేసి, ‘‘వీరమూర్తి ఎంత గొప్ప వేటగాడో మీకు తెలియనిది కాదు.

అయితే, ఈరోజు అతడు మునుపెన్నడూ లేని రీతిలో అనేక వన్య మృగాలను వేటాడి తన అద్భుత శక్తిసామర్థ్యాలను ప్రదర్శించాడు. మీ అందరి సమక్షంలో అతన్ని ఘనంగా సత్కరించాలని ఆశిస్తున్నాను!'' అంటూ మిలమిలా మెరుస్తూన్న ఒక నారింజ పండును అందించి మందహాసంతో సాగనంపాడు.

అతడు వెళ్ళగానే సభలో గుసగుసలు చెలరేగాయి. రాజుగారు తన బంధువును పరిహసిస్తున్నాడా ఏం? అని అందరూ అనుకోసాగారు. అయితే రాజు ఆ గుసగుసలను విననట్టే ఊరుకున్నాడు. రాజు ఇచ్చింది మామూలు నారింజపండు కాదనీ, దాన్నిండుగా మణులు, మాణిక్యాలు ఉన్నాయన్న నిజం వీరమూర్తి గాని, సభికులుగాని గ్రహించలేక పోయూరు.

వీరమూర్తి, బహుమతిని గురించి అంతగా పట్టించుకోలేదు. సభలో రాజు తనను మనసారా అభినందించాడు. అదే గొప్ప బహుమతి. అది చాలు! అనుకుంటూ ఉత్సాహంగా ఇంటి కేసి నడవసాగాడు. మార్గమధ్యంలో అతనికో సాధువు ఎదురు పడి, భిక్షాపాత్రను చూపాడు. వీరమూర్తి దగ్గర ఏదీ లేకపోవడంతో, సంచీలో ఉన్న రాజుగారిచ్చిన నారింజను తీసి, ‘‘చాలా ఆకలితో ఉన్నట్టున్నావు. ఈ పండును తిను,'' అంటూ భిక్షాపాత్రలో వేసి ముందుకు వెళ్ళిపోయూడు.

నారింజ మరీ బరువుగా ఉండడం గమనించి సాధువు ఆశ్చర్యపోయూడు. మిలమిల మెరుస్తూండడంతో దాన్ని రాజుగారికి ఇస్తే బావుంటుందనుకున్నాడు. వెంటనే రాజుగారి సమక్షానికి వెళ్ళాడు. రాజు అతన్ని చూడగానే సాదరంగా స్వాగతం పలికి, ఉచితాసనంలో కూర్చోబెట్టాడు. రాజు నోటి నుంచి మాట వెలువడక ముందే, ‘‘ప్రభూ, ఈ పేద సాధువు ఇచ్చే కానుకను వద్దనకండి. ప్రభువులు చిరకాలం ఆయురారోగ్యాలతో వర్థిల్లాలి!'' అంటూ నారింజను రాజుగారి చేతుల్లో పెట్టాడు.

దానిని ఒక్కసారి చూడగానే, వీరమూర్తి అదృష్టం ఎలాంటిదో రాజుకు తెలిసిపోయింది. రాజు దాన్ని పుచ్చుకుని సాధువుకు సంచీనిండుగా వెండి నాణాలిచ్చి పంపాడు. సాధువు సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరాడు. కొన్నాళ్ళకు రాజుగారు పరివారంతో వేటకు వెళుతున్నానని ప్రకటించగానే, వీరమూర్తి కూడా ఆయన వెంట వెళ్ళాడు.

మునుపటికన్నా ఎక్కువ మృగాలను వేటాడి చంపాడు. రాజుగారు మళ్ళీ అతడికి నారింజను బహుమతిగా ఇచ్చాడు. అది చాలా ప్రత్యేకమైనదని భావించిన వీరమూర్తి దాన్ని సంచీలో వేసుకుని ఇంటి దారి పట్టాడు. అతడు ద్వారాన్ని సమీపిస్తూండగా ఒక రాజోద్యోగి ఎదురయ్యూడు. అతడు తాంబూలం నములుతున్నాడు. దాని పరిమళానికి ముగ్థుడై, ‘‘నాకూ కాస్త ఆకు వక్క ఇస్తావా?'' అని అడిగాడు వీరమూర్తి. రాజోద్యోగి ఇవ్వగానే, వీరమూర్తి నారింజను అతడి చేతిలో పెట్టి వెళ్ళిపోయూడు.

వ్యంగ్యంగా నవ్వుతూ నారింజను అందుకున్న రాజోద్యోగి, రాజుగారి వద్దకు తిరిగి వెళ్ళి, తాంబూలానికి బదులుగా దీనిని పుచ్చు కున్నానని చెప్పి నారింజను ఆయనకు అప్పగించాడు. ‘‘తమరు రెండుసార్లు ఆయనకు దీనిని ఇచ్చారు. రెండుసార్లూ దీని విలువ తెలుసుకోలేక దక్కించుకోలేక పోయూడు. ఇకపై కూడా ఆయనకు సాయపడాలనుకోవడం వృథా! ఆయన జీవితంలో పైకి రాలేడు,'' అన్నాడు రాజోద్యోగి.

రాజు మౌనంగా తల పంకించాడు. మరి కొన్ని రోజులలో వీరమూర్తి వేటాడడంలో అపూర్వ ప్రతిభను కనబరచాడు. ఇదే చిట్టచివరి సారి అనుకుంటూ రాజు మళ్ళీ అతనికి నారింజను ఇచ్చాడు. వీరమూర్తి దానిని రాజు నుంచి అందుకోబోతూండగా, చేయిజారి అది కింద పడి ముక్కలుగా విరిగి పోయింది. దానిలోని మణులూ, మాణిక్యాలూ బయట పడ్డాయి.

‘‘క్షమించండి, మహారాజా!'' అంటూ అతడు కిందికి వంగి వాటిని ఒక్కొక్కటిగా ఏరుకుంటూ, సంతోషంగా నవ్వుతూన్న రాజు కేసి అబ్బురపాటుతో చూడసాగాడు. ‘‘చిట్టచివరకు నిన్ను అదృష్టం వరించింది. ఇన్నాళ్ళు నేను నీకు సాయపడాలనుకున్నప్పుడల్లా, నీకు తెలియకుండానే, అంగీకరించడానికి తిరస్కరించావు. నేను ఇచ్చిన నారింజను ఇతరులకు ఇచ్చేశావు! ఇకపై నీకు అన్నీ మంచిరోజులే!'' అన్నాడు రాజు.

రాజు వీరభద్రుడు, వీరమూర్తి జీవితానికి సరిపడా బంగారు నాణాలు ఇచ్చి పంపాడు. అతడు అచిర కాలంలోనే ధనికుడయ్యూడు. రాజుగారిలాగే తనుకూడా వీలైనప్పుడల్లా అవసరాల్లో ఉన్న వారిని ఆదుకోసాగాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం