తాజా కథలు @ CCK

నిగూఢ ప్రదేశంలో అద్భుత అన్వేషకుడు

2015-05-13 13:05:01 చిన్నారుల కథలు
అది పందొమ్మిదవ శతాబ్ద మధ్య కాలం. బ్రిటిష్‌ సామ్రాజ్యం త్వరిత గతిలో విస్తరిస్తూన్న కాలఘట్టం. భారత ఉపఖండ పటం స్పష్టంగా రూపొందించబడింది. అయితే భారతదేశ హిమాలయ పర్వత సరిహద్దులకు ఆనుకునివున్న ప్రాంతాల భౌగోళిక, రాజకీయ, సైనిక విషయూలు వారికి ఏమాత్రం తెలియవు. ముఖ్యంగా ‘‘భూప్రపంచపు పైకప్పు''గా పేరుగాంచిన, నిగూఢ ప్రదేశమైన టిబెట్‌ గురించి అసలు తెలియదు.

పద్ధెనిమిదవ శతాబ్దాంతంలో భారతదేశంలో ఏర్పాటైన గ్రేట్‌ ట్రిగ్నోమెట్రికల్‌ సర్వే సంస్థ రూపొందించిన దేశపటాలలో టిబెట్‌ పెద్దఖాళీ ప్రదేశం మాత్రమే. దాని రాజధాని లాసా కూడా కేవలం ఊహ మాత్రమే. దానిని సర్వే చేసి ప్రపంచ పటంలోకి ఎక్కించడం ఎలాగా? 1852లో గ్రేట్‌ ట్రిగ్నోమెట్రికల్‌ సర్వే సంస్థలో చేరిన సాహస ప్రియుడైన యువ అధికారి థామస్‌ జార్‌‌జ మాంట్గో మెరీకి కాశ్మీరు చిత్రపటం తయూరు చేసే బాధ్యత అప్పగించబడింది.

ప్రతికూల వాతావరణం, అడుగడుగునా అపరిమితమైన అవరోధాలు, అపాయూలు. వీటికి తోడు 1857లో భగ్గుమన్న ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం. ఇన్ని అవరోధాలను ఎదుర్కొంటూ మాంట్గోమెరీ బృందం కృతనిశ్చయంతో తన చర్యలను కొనసాగించింది. 1864 నాటికి హిమాలయూలకు దక్షిణంగా ఉన్న మహారాజా ఆఫ్‌ జమ్ము, కాశ్మీర్‌లను మ్యాపింగ్‌ చేసింది. 1400 చదరపుమైళ్ళ మంచు కొండలతో సహా 8000 మైళ్ళు కొలిచింది.ఆ సమయంలోనే మాంట్గోమెరీ టిబెట్‌కు వెళ్ళాలనుకున్నాడు.

అయితే, దాదాపు మేఘాలతో దోబూచులాడే తమ రాజ్యంలోకి పరదేశీయులు ముఖ్యంగా యూరోపియన్లు అడుగు పెట్టరాదని టిబెట్   బహిష్కరించడంతో ముందుకు వెళ్ళలేక పోయూడు. అయితే, దాన్ని గురించే సదా సర్వవేళలా ఆలోచిస్తూ గడిపి విలక్షణమైన పరిష్కారాన్ని కనుగొన్నాడు. సమర్థులైన స్థానికులను ఎంపికచేసి వారికి సర్వే చేసే పద్ధతులలో శిక్షణనిచ్చి తగిన పరికరాలతో రహస్యంగా పంపినట్టయితే, పని సానుకూలమై భూగోళశాస్ర్తానికి గొప్ప సేవచేసినట్టవుతుందని చెప్పాడు.

పథకం ప్రమాద భరితమే అయినప్పటికీ, సాధ్యమేనని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. సరిహద్దు ప్రాంతంలో అలాంటి సాహసానికి పూనుకోగల శక్తిసామర్థ్యాలు కలిగిన వారికోసం అన్వేషణ ప్రారంభించారు. అతి ప్రయత్నం మీద కొందరిని సమీకరించి టిబెట్  లో రహస్యంగా ప్రవేశించి, అక్కడి భౌగోళిక విషయూలను సేకరించుకుని తిరిగి రావడానికి రెండేళ్ళపాటు శిక్షణ నిచ్చారు.

అలా శిక్షణ పొందిన   పండిట్  స  లో ఉత్తరాంచల్   మిలామ్   గ్రామానికి చెందిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాయిన్   సింగ్   ముఖ్యుడు. ఆయన 1865 ప్రారంభంలో హంతకులైన బందిపోటు దొంగలు, దుర్గమ పర్వత మార్గాలతో ప్రతికూల వాతావరణం, ప్రతి కనుమవద్ద అప్రమత్తులైన సరిహద్దు కాపలాభటులు ఇలాంటి అవరోధాలన్నిటినీ దాటుకుని వెళ్ళడానికి బయలుదేరాడు. సన్యాసి వేషంలో యూత్రకు వెళుతున్నట్టు టిబెట్   సరిహద్దు పట్టణం, క్యిరాంగ్  ను చేరుకున్నాడు.

అయితే, అధికారులు అతని మాటలు నమ్మకుండా ముందుకు వెళ్ళడానికి అనుమతించలేదు. దాంతో ఆయన నేపాల్  కు తిరిగి వచ్చి, అక్కడి నుంచి లాసా మీదుగా మానస సరోవరానికి వెళ్ళే సన్యాసిలా వర్తకుల బిడారువాహనంలో బయలుదేరాడు. మంచునిండిన టిబెట్   దక్షిణ లోయలగుండా వర్తకుల వాహనాలు వెళుతూంటే, బౌద్ధ సన్యాసిలా నాయిన్   సింగ్   చేతిలో జపమాలతో, ఒక్కొక్క అడుగునూ లెక్కించుకుంటూ నడిచేవాడు. ఆయన వేసే దాదాపు రెండువేల అంగలు ఒకమైలుకు సమానంగా ఉండేవి.

చేతిలోని వందపూసల జపమాల సాయంతో తను నడిచిన దూరాన్ని మరింత స్పష్టంగా లెక్కగట్టగలిగేవాడు. ఆయన టిబెట్   నగరంలో దలైలామాకు తరవాతి స్థానం వాడైన పదకొండేళ్ళ పంచెన్   లామాను కలుసుకున్నాడు. ఒకనాటి వేకువజామున హఠాత్తుగా బందిపోటు దొంగలు వర్తకుల బిడారుపై పడి దోపిడీ చేశారు. ఆ సమయంలో నాయిన్   సింగ్   గుర్రం మీద వాయువేగంతో దొంగల నుంచి తప్పించుకున్నాడు. ఇలా వాహనంలో, కాలినడకన, గుర్రం మీద, రకరకాలుగా ప్రయూణం చేసి ఆఖరికి లాసానగరం చేరుకోకలిగిగాడు.

కాపలాభటులు ఎవరైనా తనను అనుమానంతో చూస్తున్నారని తెలియగానే కళ్ళు మూసుకుని ధ్యానం నటించే వాడు. కోటులో దాచుకున్న ప్రార్థనా చక్రాన్ని వెలికి తీసి తిప్పుతూ,   ఓం మణి పద్మేహం!   అంటూ పవిత్ర మంత్రాన్ని జపించేవాడు. దాంతో అధికారులు ఆయన ప్రార్థనకు అంతరాయం కలిగించకూడదని వెళ్ళిపోయేవారు. ప్రార్థనా చక్రంలో మామూలుగా ప్రార్థనా శ్లోకాలు ఉండవలసిన చోట తనుసేకరించిన సమాచారాన్ని అధికారుల కంట బడకుండా దాచేవాడు.

ఏకాంతంగా చేతిలో గిన్నె పట్టుకుని దూరంలోని కొండలను చూస్తూకూర్చునేవాడు. చూసేవాళ్ళు టీతాగుతున్నాడనుకునేవాళ్ళు. అయితే అతడు ఆ సమయూన్ని సాంకేతిక పరికరాల సాయంతో అక్కడినుంచి కొండల దూరాన్ని, సూర్య చంద్రుల, నక్షత్రాల స్థానాలను లెక్కగట్టడంలో నిమగ్నుడై ఉండేవాడు. అలా అతడు అక్షాంశ, రేఖాంశ రేఖలను గణించాడు. అతని ఊతకర్ర ధర్మామీటర్ అయింది. దానిని టీనీళ్ళలో ముంచి బాయిలింగ్   పాయింట్   సాయంతో లాసా-సముద్ర మట్టానికి 11,700 అడుగుల ఎత్తులో ఉందని నిర్ణయించాడు.

అది ఈనాటి లెక్కలకు కూడా దగ్గరగా ఉండడం అద్భుత విషయం. ఆయన సన్యాసివేషం దుస్తుల లోపల చిన్న కాంపాస్  , ఒక క్రోనోమీటర్   వాచ్  , మరికొన్ని ముఖ్య పరికరాలను దాచి ఉంచేవాడు. అనుమతి లేకుండా లాసాలో అడుగు పెట్టిన ఒక యూత్రికుణ్ణి ప్రజలు తల తెగనరకడం ఒకనాడు ఆయన కళ్ళారా చూశాడు. అక్కడి నుంచి త్వరగా బయటపడాలని యూర్లాంగ్   త్యాంగ్  పో నదీ తీరంగుండా ప్రయూణమైన మరొక వర్తకుల బిడారుతో తిరుగు ప్రయూణమయ్యూడు.

రెండు నెలల ప్రయూణంతో లామా వేషంలోని నాయిన్   సింగ్   1000 కి.మీ. నదీ ప్రవాహాన్ని కొలిచాడు. ఆ నది భారతదేశంలోని బ్రహ్మపుత్ర ఒకటే ఏమోనన్న అనుమానంతో-యూర్లాంగ్  లో ఆనవాళ్ళతో చిన్న చిన్న దుంగలను పడవేశాడు. అవి ఆ తరవాత అస్సాంలో కనుగొనబడడంతో ఒకే చోటి నుంచే రెండు నదులూ ఆవిర్భవిస్తున్న విషయం రుజువయింది! సరిహద్దు కాపలాభటులే కాకుండా తోటి ప్రయూణీకులైన వర్తకులుసైతం తనను అనుమానించడం నాయిన్  సింగ్ గమనించాడు.

ప్రలోభానికిలోనై ఏ క్షణంలోనైనా వాళ్ళు తనను భటులకు అప్పగించవచ్చునన్న సందేహం ఏర్పడడంతో-అర్ధరాత్రి సమయంలో వారి నుంచి దూరమై ఒకటిన్నర సంవత్సరం ఒంటరిగా ప్రయూణం చేసి ఇండియూ చేరుకున్నాడు. మార్గమధ్యంలో పెద్ద బంగారు బుద్ధ విగ్రహాలను గమనించడంతో టిబెట్  లో బంగారు గనులు ఉండవచ్చని ఊహించాడు. ఆయన 1867లో మరో సాహస యూత్ర చేసి ధోక్  -జాలుంగ్   బంగారు గనులను కనుగొన్నాడు.

లామా వేషంలో ఉన్నప్పటికీ గనుల స్థానిక తవ్వకాల అధికారి నాయిన్   సింగ్  ను అనుమానంతో చూశాడు. వెంటనే నాయిన్   సింగ్   తన వద్ద ఉన్న అందమైన పగడాల ఆభరణాన్ని తీసుకుని, ప్రార్థనా చక్రాన్ని తిప్పుకుంటూ వెళ్ళి, ఆభరణాన్ని అధికారి భార్య చేతికిచ్చాడు మందహాసంతో. దాంతో పరమానందం చెందిన అధికారి తన వద్ద వున్న వెయ్యికిలోల బంగారాన్ని ఆయనకు చూపాడు.

అలా గండం గడిచింది. 1874లో బౌద్ధ సన్యాసిలా కొందరితో కలిసి, గొర్రెల మందను తోలుకుని మరోసారి నాయిన్   సింగ్   లాసాగుండా చైనా రాజధాని పీకింగ్  (బీజింగ్  )కు మార్గం కనుగొనాలని బయలుదేరాడు. అయితే, ఒక సంవత్సరం తరవాత వాళ్ళు లాసా చేరేసరికి-బ్రిటిష్   గూఢచారులు వచ్చి ఉన్నట్టు అక్కడ వదంతులు వ్యాపించాయి. అపాయూన్ని శంకించిన నాయిన్   సింగ్, అంతవరకు సేకరించిన వివరాలను, మార్గాల సర్వే సమాచారాన్ని ఇద్దరు సహచరులకు ఇచ్చి ఇండియూకు పంపాడు.

ఆ తరవాత తమ వద్ద ఉన్న పనికిరాని వస్తువులను ఒక సంచీలో వేసి, తాము బసచేసిన సత్రం యజమానితో,   మేము నగరానికి ఉత్తరంలోని పవిత్ర స్థలాన్ని దర్శించిరావాలి. తిరిగి వచ్చేంత వరకు వీటిని భద్రంగా ఉంచు. అద్దె ఇస్తాము,   అని చెప్పాడు. సత్రం యజమాని సమ్మతించాడు. నాయిన్ సింగ్   తన అనుచరులతో కొంత దూరం ఉత్తరంవైపు వెళ్ళి, చీకటి పడగానే దక్షిణంగా తిరిగి భటుల కన్నుగప్పిసురక్షితంగా కొన్నాళ్ళకు స్వదేశం చేరుకున్నాడు.

బ్రిటిష్   ప్రభుత్వం నాయిన్   సింగ్  ను సుప్రసిద్ధ అన్వేషకులు లివింగ్  స్టోన్  , గ్రాంట్  లాంటి వాడని కొనియూడింది. మరే యూరోపియన్   కూడా వెళ్ళలేని ఆసియూలోని కొన్ని నిగూఢ ప్రదేశాలకు వెళ్ళి ఆ ప్రాంతాల పట్ల సరైన సమాచారాన్ని సేకరించిన విశ్వాసపాత్రుడు, సాహసశీలి అని ప్రశంసిస్తూ, రాయల్   జియోగ్రాఫికల్   సొసైటీ ఆయన్ను బంగారు పతకంతో సత్కరించింది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం