తాజా కథలు @ CCK

కాకి - గేదె

2015-03-11 07:05:01 చిన్నారుల కథలు
అది వేసవి కాలం. ఎండలు విపరీతంగా మండుతున్నాయి. ఓ చెట్టు నీడలో ఒక గేదె సేదతీరుతోంది. అది తన కళ్లను సగం మూసుకొని, ఆహారాన్ని నెవురువేస్తోంది. ఇంతలో ఆ చెట్టు మీద ఒక కాకి వాలింది. ఎండ తీవ్రంగా ఉండటం వల్ల చెట్టు మీద కూడా కాస్త వేడిగానే ఉంది. చెట్టు కింద చల్లగా ఉందని ఆ కాకి నేల మీద వాలింది. వురీ నేల మీద ఎందుకులే అని, అక్కడ నుండి ఎగిరి గేదె కొమ్ముల మీద వాలింది. ఆ గేదె కాకిని అసలు పట్టించుకోకుండా అలానే కూర్చుంది. కాకి అలా ఆ గేదె కొమ్ముల మీద కాసేపు సేదతీరింది. ఇక ఎగిరి వెళదావునుకున్న సమయంలో, కాకి తన వునసులో ఇలా అనుకుంది.

‘పిచ్చి గేదె! నేను ఇంత సేపు దీని కొమ్ముల మీద కూర్చుని సేద తీరాను. దీనికి తెలియును కూడా తెలియలేదు. అంటే నేను ఈ గేదె గుర్తించలేనంత చాకచక్యంగా కూర్చున్నాను. దీనికి తెలియుకుండా నేను దీన్ని తెలివిగా వాడుకున్నాను.’ అని కాకి తన తెలివికి తనే మురిసిపోయింది.

గేదె కొమ్ముల మీద నుంచి ఎగిరి, గేదె ముందు గర్వంగా వాలింది. ‘‘నేను ఇప్పుడు వెళ్లవచ్చా?అని ఎగతాళిగా గేదెను అడిగింది.

‘‘నీలాంటి అల్పప్రాణులు నా మీద వాలి సేద తీరి వెళ్లడం నేనసలు పట్టించుకోను. ఒకవేళ నువ్వు నా మీద ఇంత సేపటి వరకు సేద తీరినందుకు నాకు కృతజ్ఞతలు తెలిపి ఉంటే నా దృష్టిలో నీ స్థాయి పెరిగేది’’ అని బదులిచ్చింది ఆ గేదె. దీంతో కాకి గర్వం పటాపంచలయింది. సిగ్గుతో తల దించుకొని మారువూట్లాడకుండా అక్కడి నుండి ఎగిరి వెళ్లిపోయింది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం