తాజా కథలు @ CCK

భారతమాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు

2015-06-05 03:05:01 దేశభక్తి గీతాలు
భారతమాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవ ధాత్రికి జేజేలు
త్రివేణీ సంగమ పవిత్రభూమి నాల్గు వేదాలు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి పంచశీలభోధించిన భూమి
శాంతి దూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన నెహ్రు
విప్లవ వీరులు వీరమాతల ముద్దు బిడ్డలై మురిసిన భూమి
సహజీవనము సమభావనమూ సమతావాదము వేదముగా
ప్రజాస్వామ్యమే ప్రగతి మార్గముగా లక్ష్యములైన వెలసిన భూమి
భారతమాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం