తాజా కథలు @ CCK

బుజ్జి మేక బుజ్జి మేక

2015-05-29 11:05:01 చిన్నారి గీతాలు
బుజ్జి మేక బుజ్జి మేక ఏడకెల్తివీ ? రాజు గారి తోటలోన మేత కెల్తిని .
రాజు గారి తోటలోన ఏమి చూస్తివి ?
రాణి గారి పూలచెట్ల సొగసు చూస్తిని !
పూలచెట్లు చూసి నీవు ఊరకుంటివా ?
నోరురగా పూల చెట్లు మేసివస్తిని .
మేసివస్తె నిన్ను భటులు ఏమిచేసిరి ?
భటులు వచ్చి నాకాళ్ళు విరుగగొట్టిరి .
కాలు విరిగిన నీవు ఊరుకుంటివా ?
మందుకోసం నేను డాక్టరింటికెల్తిని .
మందు ఇచ్చిన డాక్టరుకు ఏమిస్తివి ?
చిక్కనైన తెల్ల పాలు అందిస్తిని .
ఉన్న పాలు డాక్టరుకిస్తే యజమానికేమిస్తావు ?
గడ్డి తినక ఒకపూట పస్తులుండి తీరుస్తా .
పస్తులుంటే నీకు నీరసం రాదా ?
పాడు పని చేయనింక బుద్దివచ్చెనాకు .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం