తాజా కథలు @ CCK

చిలకలుగాని చిలకల్లారా

2015-04-17 01:05:01 చిన్నారి గీతాలు
చిలకలుగాని చిలకల్లారా
సీతాకోక చిలకల్లారా
రంగు రంగులా రెక్కలతో
సింగారాలు చిందేరా ?
వన్నెల వన్నెల్ పూల మీద వాలుచున్నారా ?
కన్నుల కన్నుల పండుగ చేస్తూ
కదులుతున్నారా ?
వనమంతా - దినమంతా వసంత శోభలతో
అందాల - ఆనందాల ఆటలాడేరా
చిలకలుగాని చిలకల్లారా
సీతాకోక చిలకల్లారా .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం